ఎప్పటికపుడు తెలుగు సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త కథలు తెరకెక్కుతూనే ఉన్నాయి. ఈ కోవలోనే వస్తున్న మరో మూవీ శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్(srikakulam sherlock holmes)టైటిల్ లోనే తన ప్రత్యేకత చూపిస్తున్న ఈ మూవీలో వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల,అఖండ నాగ మహేష్, రవితేజ నేనింతే హీరోయిన్ శియాగౌతమ్, అనీష్ కురివిల్లా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ సాంగ్ ఒకటి రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఈ పాటకి యంగ్ అండ్ డైనమిక్ పొలిటికల్ లీడర్ రామ్మోహన్ నాయుడు( Kinjarapu Ram Mohan Naidu)నుంచి ప్రశంసలు దక్కాయి.
ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపి గా హ్యాట్రిక్ కొట్టిన వ్యక్తి కింజరపు రామ్మోహన్ నాయుడు. లేటెస్ట్ గా మోదీ కేబినెట్ లో కేంద్ర సహాయ మంత్రి పదవిని పొంది పిన్న వయసులోనే ఆ అర్హత సాధించిన వ్యక్తిగా రికార్డు కూడా సృష్టించాడు. ఇక కొన్ని రోజుల క్రితం శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్ నుంచి ఒక సాంగ్ రిలీజ్ అయ్యింది. సాంగ్ మొత్తం కూడా శ్రీకాకుళం ప్రజల యొక్క మంచి తనాన్ని, ఉపాధి కోసం వేరే ఊరు వలస వెళ్లడం, తమ వారిని తలుచుకుంటూ బాధపడటం వంటివి చూపించారు.శ్రీకాకుళం సాంగ్ తనకి ఎంతో నచ్చిందని,పర్ఫెక్ట్ గా శ్రీకాకుళం వాస్తవ పరిస్థితులని చెప్పిందని సోషల్ మీడియా ద్వారా చెప్పారు.అలాగే పాట రాసిన రామజోగయ్య శాస్త్రి ని, సింగర్ మంగ్లీ తో పాటు చిత్ర యూనిట్ ని కూడా అభినందించాడు. పాట తనకి ఇనిస్పిరేషన్ కలిగించిందని కూడా చెప్పాడు.
ఇక రామ్మోహన్ నాయుడు అంత బిజీలో కూడా తమ పాట విని అభినందించడం పట్ల చిత్ర యూనిట్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. మూడు పాత్రల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ద్వారా రైటర్ మోహన్ దర్శకుడుగా పరిచయం కాబోతున్నాడు. ఇక టైటిల్ లోని షెర్లాక్‌హోమ్స్ లో షెర్ అంటే షర్మిలమ్మ,లోక్ అంటే లోక్‌నాథం,హోమ్ అంటే ఓం ప్రకాష్…సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందించగా గణపతి సినిమాస్ పై వెన్నపూస రమణారెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.