మీ అందరకి ఒక విషయం చెప్తున్నా! శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ని మాత్రం తక్కువ అంచనా వెయ్యకండి! ఆమెలో మాములు టాలెంట్ లేదు. తనలో ఉన్న ఆ టాలెంట్ గురించి తెలిస్తే మీరు కూడా నిజమే అంటారు.అందుకు సాక్ష్యంగా సోషల్ మీడియాలో ఒక వీడియో కూడా ప్లే అవుతుంది. అది చూసిన వారందరు ఇప్పుడు అవాక్కవుతున్నారు.జాన్వీ గురించే గంటలు గంటలు మాట్లాడుకుంటున్నారు.ఇంతకీ ఆ వీడియోలో ఏముంది! అసలు ఆ టాలెంట్ ఏంటి!
జాన్వీ కపూర్ తన నాలుకని మడత పెట్టి అందరకి ట్విస్ట్ ఇచ్చింది. ఏంటండీ నాలుక మడత పెట్టడం కూడా పెద్ద గొప్ప అని అనుకుంటున్నారా! ఇక్కడే అసలు విషయం ఉంది. జాన్వీ నాలుక మడతపెట్టింది 360 డిగ్రీస్ లో. 360 డిగ్రీస్ అంటే మీరు ఊహించుకోండి ఎంత కష్టమో. పైగా అంతటితో ఊరుకోలేదు. నాలుకని మెలి తిప్పుతుంది. ఒక రకంగా చెప్పాలంటే కుర్చీని మడతపెట్టినట్టు అనుకోండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ ప్రాసెస్ అంత ఆమె చాలా ఈజీ గా చేస్తుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో ఉంది. ఓ లుక్ వెయ్యండి
ఇక రాబోయే రోజుల్లో తెలుగు సినీ పరిశ్రమని జాన్వీ ఏలడం ఖాయం. ఎన్టీఆర్(ntr)రామ్ చరణ్ (ram charan) లాంటి అగ్ర హీరోల సరసన ఆమె నటిస్తుంది. ఇందులో ఎన్టీఆర్ దేవర(devara)శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. అక్టోబర్ 10 న విడుదల కాబోతుంది. చరణ్ మూవీ ఇటీవలే స్టార్ అయ్యింది. శ్రీదేవి అభిమానులు కూడా జాన్వీ తెలుగు సినిమా రంగంలో తన తల్లిలా నెంబర్ వన్ హీరోయిన్ అవ్వాలని కోరుకుంటున్నారు.