దిశ, వెబ్‌డెస్క్ : నేటి యువత ఏ పని చేసినా వినూత్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది. సరి కొత్త ఐడియాలతో తన కార్యక్రమాలను రూపొందించుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లిలు, ప్రీ వెడ్డింగ్ షూట్స్, శుభలేఖలు ఇలా ఏదైనా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. పెళ్లి హాజరైన బంధు మిత్రులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల వాళ్లు సైతం వారి వివాహ వైభోగం గురించి మాట్లాడుకునేలా ప్లాన్ చేస్తున్నారు. నలుగురిలో ఒకరిలా కాకుండా నలుగురే నా వెనకాల అన్నట్లు నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు. ‘అబ్బ.. అదిరా పెళ్లంటే..’ అనేలా ఫొటో ఆల్భమ్‌ను పదిల పర్చకున్నట్లు.. పది కాలాలపాటు ప్రజల మదిలో నానేలా క్రియేట్ చేస్తున్నారు. తాజాగా పెళ్లి జంట రూపొందించిన వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్‌గా మారింది. దానిని చూసిన వారంతా ‘ఔరా..’ అంటూ నోరెళ్లబెడుతున్నారు.
ఇంతకూ ఆ వెడ్డింగ్ కార్డ్ ప్రత్యేకత ఏంటంటే.. ఏ ఆహ్వాన పత్రిక అయినా శ్రీమతి & శ్రీ అన్నదగ్గర మనం ఎవరినైతే ఆహ్వానిస్తామో వాళ్ల పేరు రాసి ఇస్తాం. కానీ ఈ వెరైటీ వెడ్డింగ్ కార్డులో శ్రీమతి & శ్రీ దగ్గర.. ‘మీ పేరు మా మనస్సులో ఉంది’ అని రాశారు. అడ్రస్ రాయాల్సిన లైన్‌లో… ‘మీకు మీ కుటుంబానికి ఇదే మా ఆహ్వానము’ అని ముద్రించారు. అయితే ఈ వెడ్డింగ్ కార్డును చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. ఆహ్వానం అందుకునే వారిని బుట్టలో వేసుకునేందుకే ‘మీ పేరు మా మనస్సులో ఉంది’ అంటూ చిలిపిగా పెట్టారని.. అమ్మాయిలతే పడిపోవాల్సిందే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ మనస్సున్న ఆహ్వానం కార్డు అందరిని ఆకట్టుకుంటుంది.