భారతీయుల ఆరాధ్య దైవం రాముడు. ఆ అయోధ్య రాముడి జీవిత కథ అయిన రామాయాణం మీద ఎన్నో సినిమాలు తెరకెక్కాయి.బహుశా ప్రపంచ సినీ చరిత్రలో రాముడి మీద వచ్చినన్ని సినిమాలు ఇంక ఎవరి మీద రాలేదు. అయినా సరే ప్రేక్షకులు ఆదరిస్తునే ఉంటారు.త్రేతా యుగంలో రాముడు నడయాడిన పుణ్య భూమిలో రాముడు సినిమా చూడటమే ఒక అదృష్టంగా కూడా భావిస్తారు. తాజాగా రాముడు మీద తెరకెక్కుతున్నమరో మూవీ అప్ డేట్ రాముడి భక్తుల్లో ఆనందాన్ని నింపుతుంది
బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ రాముడుగా, సాయి పల్లవి సీతగా చెయ్యబోయే చిత్రం రామాయణ. రాకింగ్ స్టార్ యష్ రావణుడుగా చేస్తున్నాడు. ఈ విషయం అడపాదడపా సోషల్ మీడియాలో వస్తుండేది. కానీ మేకర్స్ ఎవరు కూడా అధికారంగా ప్రకటించలేదు. ఇప్పుడు ఏప్రిల్ 17 శ్రీరామ నవమి సందర్భంగా అధికార ప్రకటన రానుంది. అంటే సినిమా ఎప్పుడు ప్రారంభమయ్యేది ఎవరు ఎవరు చేస్తున్నారు అనే విషయం చెప్పనున్నారు. దీంతో కౌసల్యా రాముడు మరోసారి భారతీయ గడ్డ మీద అడుగుపెట్టడానికి సన్నద్ధమవుతున్నట్టయ్యింది. సన్నీడియోల్ ఆంజనేయుడుగా
చెయ్యబోతున్నాడు.ప్రముఖ హీరోయిన్లు లారా దత్తా, రకుల్ ప్రీత్ సింగ్ లు కైకేయి, శూర్పణఖ పాత్రల్లో కనపడబోతున్నారు.వీళ్ళే కాకుండా ఇండియన్ చిత్ర పరిశ్రమకి చెందిన అతిరథ మహారధులందరు రామాయణలో మెరవబోతున్నారు.
2025 దీపావళికి రాముడి దర్శన భాగ్యాన్ని కలిగించాలనే పట్టుదలతో మేకర్స్ ఉన్నారు.నితీష్ తివారి దర్శకుడుగా వ్యహరిస్తున్నాడు. ఈయన గతంలో దంగల్ కి దర్శకత్వం వహించాడు. ఐదు సంవత్సరాల నుంచి మేకర్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఉన్నారు. దీన్ని బట్టి యూనిట్ ఎంత కృత నిశ్చయంతో ఉందో అర్ధం అవుతుంది.ఇండియన్ సినీ పరిశ్రమలో ఇంతవరకు కనీవిని ఎరుగని రీతిలో అత్యంత భారీ బడ్జట్ తో రామాయణ తెరకెక్కనుంది.