వేములవాడ రాజన్న దర్శనానికి ప్రత్యేక బస్సులు
తెలంగాణలోని వేములవాడ రాజన్న (Vemulawada Rajanna Temple) ఆలయానికి మహా శివరాత్రి సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. భక్తుల సౌకర్యం కోస టీఎస్ఆర్టీసీ(TSRTC Special Buses) 1000 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ నెల 7న 265 ప్రత్యేక బస్సులు, 8న 400, 9న 329 బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ బస్సులు వరంగల్, హన్మకొండ, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, నర్సంపేట, కోరుట్ల, మెట్పల్లి, ఆర్మూర్, కామారెడ్డి, నిర్మల్, వేములవాడ డిపోల నుంచి నడుపుతున్నట్లు తెలిపారు. ఈ మూడు రోజులు వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయం వరకు దేవాలయం సౌజన్యంతో ఉచితంగా 14 మినీ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.