నిరుద్యోగుల పక్షాన పోరాటానికి పిలుపునిస్తే హౌజ్ అరెస్ట్ లు చేయాలని చూస్తారా అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులను ఎందుకు ఆపుతున్నారని, ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు. మహిళనై ఉండి హౌజ్ అరెస్ట్ కాకుండా ఉండేందుకు, పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాత్రి… గడపవలసిన పరిస్థితి రావడం మీకు అవమానం కాదా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల పక్షాన తమ పోరాటం ఆపేది లేదని ట్వీట్ చేశారు.