శతాధిక చిత్రాల దర్శకుడు కీర్తి శేషులు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన మూవీ దేవి.1995 మార్చి 12 న విడుదల అయ్యింది. అంటే నేటికీ పాతిక సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా ఆ మూవీలో దేవి గా టైటిల్ రోల్ పోషించిన ప్రేమ ఇంటర్వ్యూ జరిగింది. అందులో ఆమె చెప్పిన ఒక విషయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది.
దేవి సినిమా కథ మొత్తం పాము ప్రధాన పాత్రగా చేసుకొని నడుస్తుంది. పాముగా నటించింది ప్రేమనే. ఆనాటి చిత్ర విషయాలని ప్రేక్షకులతో పంచుకుంది. షూటింగ్ సమయంలో యూనిట్ కి చెందిన ఒక వ్యక్తిని నిజంగానే పాము కాటేసిందని అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లేలోపే చనిపోయాడని చెప్పింది. రెండు రోజులు షూటింగ్ ని కూడా ఆపేశామని పైగా అతని గురించి ఆలోచిస్తూనే షూటింగ్ ని కంప్లీట్ చేశామని కూడా చెప్పుకొచ్చింది. ప్రేమ చెప్పిన ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
అలాగే చలికి వణుకుతూ మంచులోనే క్లైమాక్స్ పార్ట్ ని కంప్లీట్ చేశామని చెప్పింది. కోడి రామకృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తి దర్శకత్వంలో నటించడం తన అదృష్టం అని కూడా చెప్పుకొచ్చింది. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఎంఎస్ రాజు దేవిని నిర్మించాడు.దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన పాటలు నేటికీ మారుమోగిపోతుంటాయి. పైగా ఆయనకి ఇదే ఫస్ట్ మూవీ.ఇక తనకి ఎయిర్ హోస్ట్ కావాలనే కోరిక ఉండేదని తన తల్లి కోరిక మీదనే సినిమాల్లోకి వచ్చానని కూడా ప్రేమ చెప్పింది. ధర్మచక్రం, ఓం, కోరుకున్న ప్రియుడు లాంటి చిత్రాలు ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.