EntertainmentLatest News

సంక్రాంతి బరిలో నిలిచేదెవరు? వెనక్కి వెళ్ళేదెవరు?


తెలుగు సినిమాకి సంక్రాంతి సీజన్‌ అనేది చాలా ఇంపార్టెంట్‌.  సంక్రాంతిని టార్గెట్‌ చేసుకొని చాలా సినిమాలు రెడీ అవుతుంటాయి. అయితే రిలీజ్‌ దగ్గరికి వచ్చేసరికి అదొక పెద్ద యుద్ధంలా మారిపోతుంది. అందరు హీరోలు తమ సినిమాలు సంక్రాంతికే రావాలని కోరుకుంటారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో లెక్కకు మించిన సినిమాలు రిలీజ్‌కి వచ్చేస్తాయి. దాంతో థియేటర్ల సమస్య వచ్చేస్తుంది. ఇది ప్రతి సంవత్సరం వచ్చే సమస్యే అయినా.. ఈసారి అది మరింత కష్టతరంగా మారింది. 2024 సంక్రాంతికి తమ సినిమా రిలీజ్‌ చేసుకోవాలని చాలా మంది ప్రొడ్యూసర్స్‌ ప్లాన్‌ చేసుకున్నారు. పెద్ద హీరోల సినిమాలు, చిన్న హీరోల సినిమాలు, కొత్తవారితో చేసిన కొన్ని సినిమాలు… ఇలా పదికిపైగా సినిమాలు రిలీజ్‌ అవుతున్నాయి. దీన్ని బట్టి ఈసారి సినిమాల రిలీజ్‌ విషయంలో వార్‌ కొంచెం తీవ్రంగానే ఉంటుందని అర్థమవుతోంది. 

సంక్రాంతికి రిలీజ్‌ కాబోతున్న సినిమాల గురించి చెప్పాల్సి వస్తే… మహేష్‌ ‘గుంటూరు కారం’, రవితేజ ‘ఈగిల్‌’, నాగార్జున ‘నా సామిరంగా’, వెంకటేష్‌ ‘సైంధవ్‌’, ప్రశాంత్‌ వర్మ ‘హనుమాన్‌’, విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌ మూవీ.. ఇవీ ప్రధానంగా చెప్పుకోవాల్సిన తెలుగు సినిమాలు. ఇవి కాక కొన్ని చిన్న సినిమాలు వున్నాయి. వీటితోపాటు డబ్బింగ్‌ సినిమాలు ఎలాగూ ఉంటాయి. 

సంక్రాంతి సీజన్‌కి ఇంతలా ప్రాముఖ్యత పెరగడానికి కారణం.. హాలీడేస్‌. కుటుంబ సభ్యులంతా కలిసి సినిమాలకు వెళ్ళి ఎంజాయ్‌ చెయ్యడం అనేది చాలా కామన్‌. సంక్రాంతికి ఎక్కువ సినిమాలు రిలీజ్‌ అవుతాయి కాబట్టి ఏయే సినిమాలు చూడాలి అనేది ముందుగానే ప్లాన్‌ చేసుకుంటారు. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా ఆ మూడు రోజులు కలెక్షన్లు మాత్రం బాగానే ఉంటాయి. ఇప్పటివరకు సంక్రాంతి రిలీజ్‌ చేద్దామనుకున్న సినిమాలు అన్నీ ఉంటాయా? లేక కొన్ని పోటీ నుంచి తప్పుకుంటాయా అనేది తేలాల్సి ఉంది. ఆల్రెడీ పెద్ద సినిమాలన్నీ సంక్రాంతిని టార్గెట్‌ చేసుకున్న సినిమాలే కావడంతో ఏదీ వెనక్కి వెళ్ళే అవకాశం లేదని అర్థమవుతోంది. ఇప్పుడు చెప్పుకున్న పెద్ద సినిమాల్లో ముందుగానే కొన్ని డేట్‌ ఫిక్స్‌ చేసుకొని ఉండగా, మరికొన్ని తమ సినిమాల రిలీజ్‌ పోస్ట్‌పోన్‌ చేసుకొని సంక్రాంతి డేట్‌కి వచ్చాయి. అలా వచ్చిన సినిమాల విషయంలో ఎక్కువ టెన్షన్‌ ఉంటుందని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. నిర్మాతలకు టెన్షన్‌ తప్పేలా లేదు. ఎందుకంటే కొంత మంది నిర్మాతలు వేరే సినిమాలకు డిస్ట్రిబ్యూషన్‌ కూడా చేస్తున్నారు. కాబట్టి, నిర్మాతగా చేసే సినిమాలు, డిస్ట్రిబ్యూట్‌ చేసే సినిమాలను బ్యాలెన్స్‌ చేయడం  కొంత కష్టంతో కూడుకున్న పనే. మరి దాన్ని అధిగమించి తమ సినిమాల రిలీజ్‌లను ఎలా ప్లాన్‌ చేసుకుంటారో చూడాలి. 

 



Source link

Related posts

తెలుగు తెరపై మరో మలయాళ మూవీ వస్తుందా! నిన్న అక్కడ హిట్  

Oknews

Bandla Ganesh in Cheque Bounce Case బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష

Oknews

danam nagendar and ranjithreddy joined in conress | Congress Joinings: ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్

Oknews

Leave a Comment