Top Stories

సంక్రాంతి సెలవుల పెంపు.. ఎవరికి ఎంత లాభం?


ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి సెలవులు పెంచారు. అదనంగా మరో 3 రోజుల పాటు సెలవులు వచ్చాయి. దీంతో సంక్రాంతి సినిమా మేకర్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ సినిమాలకు మరిన్ని కలెక్షన్లు వస్తాయని భావిస్తున్నారు. ఇంతకీ ఈ పెంపు వల్ల ఎవరికి ఎక్కువ లాభం.

ప్రాక్టికల్ గా చూసుకుంటే, సెలవుల పెంపు వల్ల గుంటూరుకారం సినిమాకే ఎక్కువ లాభం. ఎందుకంటే, ఈ సినిమాకు ఆల్రెడీ నెగెటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయిపోయింది. కానీ సెలవుల పెంపు వల్ల మరింత మంది గుంటూరుకారం చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. అలా గుడ్డిలో మెల్లలా గుంటూరుకారం కొంత తేరుకునే అవకాశం ఉంది. 

లెక్కప్రకారం ఇవాళ్టి నుంచి ఈ సినిమాకు వసూళ్లు తగ్గిపోవాలి. సంక్రాంతి సీజన్ ముగిసింది. ఆ ప్రభావం ఆల్రెడీ నైజాంలో కనిపిస్తోంది. ఈరోజు మార్నింగ్ షో ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. ఏపీలో కూడా పరిస్థితి ఇలానే ఉండేది కాకపోతే సెలవులు పొడిగించడం కాస్త కలిసొచ్చింది. ఇలాంటి టైమ్ లో టికెట్ రేట్లు తగ్గిస్తే, సినిమాకు మరింత బెనిఫిట్ అయ్యేది.

ఇక సెలవుల వల్ల లాభపడే రెండో సినిమా హనుమాన్. ఇప్పటికే సంక్రాంతి విజేతగా నిలిచింది ఈ మూవీ. బ్లాక్ బస్టర్ టాక్ తో నడుస్తోంది. అయితే థియేటర్లు తక్కువగా ఉన్నాయి. దీంతో ఈ 3-4 రోజుల్లో టికెట్లు దొరకని చాలామంది, సెలవుల పొడిగింపుతో హను-మాన్ ను చూడ్డానికి ప్రయత్నిస్తారు. నా సామిరంగ, సైంధవ్ సినిమాలు కూడా సెలవుల పెంపుతో కాస్తోకూస్తో లబ్ది పొందే అవకాశం ఉంది. 

ఇలా సంక్రాంతి సెలవులు పొడిగించడం వల్ల ఏపీలో గుంటూరుకారం సినిమా కొంత తేరుకునే అవకాశం ఉంది. ఇలాంటి టైమ్ లో సినిమాకు మరోసారి పబ్లిసిటీ ఇస్తే బెటర్.



Source link

Related posts

కొరియోగ్రాఫర్ అవుదామనుకొని హీరో అయ్యాడు

Oknews

జనసేనను అసహ్యించుకునేలా చేస్తున్న నాదెండ్ల!

Oknews

సభలోకి లైన్ క్లియర్.. కేబినెట్‌లోకి వస్తారా?!

Oknews

Leave a Comment