Health Care

సంతానలేమిని దూరం చేసే ఆహారాలు.. నిజంగా పనిచేస్తాయా?


దిశ, ఫీచర్స్ : ఒకవైపు ఆధునిక, వైజ్ఞానిక సమాచారం అందుబాటులో ఉంటున్నప్పటికీ, మరోవైపు మూఢ నమ్మకాలు, అపోహలు మన సమాజంలో కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆహారం, ఆరోగ్యం, సంతాన సాఫల్యత విషయంలో పలువురు వాటిని నమ్ముతున్నారు. కొన్ని రకాల పండ్లు, ఆహారాలు వంధత్వాన్ని తగ్గిస్తాయనే పేరుతో కొనసాగుతున్న ప్రచారం స్త్రీ, పురుషులిద్దరిలోనూ అపోహలకు కారణం అవుతోంది. వాస్తవం ఆలోచించేవారు ఉంటున్నప్పటికీ, అపోహలను నమ్మేవారు కూడా చాలామందే ఉంటున్నారు. ఇన్‌ఫెర్టిలిటీ విషయంలో ఉపయోగపడతాయనే కొన్ని ఆహారాల విషయంలో అపోహలను, వాస్తవాలను పరిశీలిద్దాం.

ఫైనాపిల్ గింజలు వంధత్వాన్ని దూరం చేస్తాయి

ఫైనాపిల్ గింజలు లేదా టెంక తినడంవల్ల వంధత్వాన్ని ఎదుర్కోవచ్చని, సంతాన సాఫల్యానికి మంచిదని పలువురు మహిళలు నమ్ముతున్నారు. పైగా ఇలా తినడంవల్ల ఇంప్లాంటేషన్‌లో సహాయపడతాయని, నొప్పి నివారణగా పనిచేస్తాయని కొందరు చెప్తుంటారు. రుతుక్రమ సమస్యల్లో నొప్పి నివారణగా పనిచేస్తుందని కూడా ప్రచారంలో ఉంది. కానీ ఇదంతా వాస్తవం కాదని నిపుణులు చెప్తు్న్నారు. పైనాపిల్ గింజల్లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్‌ల సముదాయం ఉంటుంది. విటమిన్ సి, బి6 సమృద్ధిగా ఉండటంవల్ల ఆరోగ్యానికి మంచిది కానీ, నెలసరి సమయంలో నొప్పి నివారణగా పనిచేస్తుందని, సంతాన సాఫల్యానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందనేది మాత్రం అపోహ. పైగా సంతానలేమిని దూరం చేయడంలో ఫైనాపిల్ గింజలు అద్భుతంగా పనిచేస్తాయనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

కందగడ్డలు తింటే కవలలు పుడతారు

ప్రస్తుతం చాలామందిలో ఉన్న మరొక అపోహ ఇది. కందగడ్డలు తినడానికి, కవలలు పుట్టడానికి సంబంధం లేదని నిపుణులు చెప్తున్నారు. కందగడ్డలు తినడంవల్ల అందులోని హార్మోన్ ఫైటోఈస్ట్రోజెన్ కారణంగా కొంత మేలు జరుగుతుంది. మల్టిపుల్ అండోత్సర్గాన్ని ప్రేరేపిస్తుంది. అంతేకానీ అవి తినడంవల్ల మాత్రమే కవలలు పుడతారనేది అపోహ మాత్రమే. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో కందగడ్డలు మెడిసిన్‌లా పనిచేస్తాయనడం కరెక్ట్ కాదు. ఇవన్నీ రూమర్స్ లేదా అపోహలు మాత్రమే.

దానిమ్మతో సంతానోత్పత్తి పెరుగుతుంది

స్త్రీ పురుషులిద్దరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంలో దానిమ్మ పండ్లు సానుకూల ప్రభావాలను చూపుతాయని నమ్ముతారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అధికంగా ఉంటుంది. గర్భాశయానికి రక్త ప్రసరణను మెరుగుపర్చడంలో తీసుకోదగిన ఫలం. అంతేకానీ దానిమ్మ పండ్లు తినడంవల్ల మాత్రమే సంతాన సాఫల్యం కలుగుతుందనేది మాత్రం అపోహ.



Source link

Related posts

సూర్యగ్రహణాన్ని వెంటాడుతున్న NASA.. ఏప్రిల్ 8 తర్వాత ఏ రహస్యాలు బయటపెట్టనుంది..

Oknews

ఆ పంపెనీలో పనిచేయడానికి క్యాబిన్ లే కాదు.. పడుకోవడానికి ప్రత్యేక గదులు కూడా ఉన్నాయట..

Oknews

రాత్రంతా ఫుల్లుగా ఏసీ ఆన్‌చేసి పడుకుంటున్నారా?.. ఇది తెలిస్తే షాక్ అవుతారు !

Oknews

Leave a Comment