దిశ, ఫీచర్స్ : ఒకవైపు కంపెనీలు ఎంప్లాయిస్‌పై పని ఒత్తిడిని పెంచుతున్నాయి. డెడ్‌లైన్స్ పెడుతూ వర్క్ పూర్తి చేయాలని బలవంతం చేస్తున్నాయి. దీంతో ఉద్యోగులు మానసిక అనారోగ్య పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అధ్యయనాలు చెప్తున్నాయి. ఇలాంటి సందర్భంలో చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం మీరు సంతోషంగా లేరా? అయితే లీవ్ తీసుకుని ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకోండని తమ ఎంప్లాయిస్‌కు ఆఫర్ ఇచ్చింది. బెట్టర్ వర్క్ – లైఫ్ బ్యాలెన్స్ అచీవ్ చేసేందుకు అన్‌హ్యాపీ లీవ్స్ ప్రకటించి ప్రజెంట్ ట్రెండింగ్‌లో ఉంది.
సౌత్ చైనాకు చెందిన Yu Donglai.. సెంట్రల్ చైనా హీనన్ ప్రావిన్స్‌లో Pang Dong Lai అనే రిటేల్ కంపెనీని స్థాపించాడు. తన కింద పనిచేస్తున్న ఎంప్లాయిస్ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో సరికొత్త పాలసీని తీసుకొచ్చాడు. ప్రతీ స్టాఫ్ మెంబర్ ఫ్రీడమ్‌తో జీవించాలని.. ఒకవేళ హ్యాపీగా లేకపోతే ఆఫీసుకు రానక్కర్లేదని ప్రకటించాడు. బాధలో ఉన్నట్లయితే.. పది రోజులు అడిషినల్‌గా లీవ్స్ తీసుకోవచ్చంటూ.. ఏటా 50 లీవ్స్ ఎక్స్‌ట్రా తీసుకునే సౌలభ్యాన్ని అందించాడు. ఈ టైమ్‌లో రిలాక్స్ అయిపోయి మరింత ఉత్సాహంతో ఆఫీసుకు వస్తారనేది ఈ సూపర్ మార్కెట్ చైర్మన్ ఉద్దేశం కాగా మేనేజ్మెంట్ ఈ లీవ్స్‌ను తిరస్కరించే అవకాశం లేదని అనౌన్స్ చేశాడు.