Health Care

సక్సెస్‌ వైపు నడిపించే మార్నింగ్ హాబిట్స్.. పాటిస్తే అద్భుతాలే..


దిశ, ఫీచర్స్ : మీకు తెలుసా? ‘పొద్దున్నే నిద్రలేచే పక్షులు తమకు ఆహారంగా అవసరం అయ్యే కీటకాలను, ఫలాలను తప్పకుండా పొందుతాయి’ అనేది ఒక సామెత. కానీ ఇది మనుషులకూ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఉదయపు వేళ అలవాట్లే చాలామందిని సక్సెస్ వైపు నడిపిస్తాయని నిపుణులు చెప్తున్నారు. ఎర్లీ మార్నింగ్ లేవడం కాస్త కష్టంగా అనిపించినా ఆరోజు మొత్తంలో ఎనర్జీ లెవల్స్, ప్రొడక్టివిటీతోపాటు ఓవరాల్ సెన్స్ ఆఫ్ వెల్‌ పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అటువంటి హాబిట్స్ ఏంటో తెలుసుకుందాం.

నిశ్శబ్ద సమయాన్ని ఆస్వాదించండి

చాలా మంది సక్సెస్‌ఫుల్‌ పీపుల్ తమ రోజువారి దినచర్యను ఎర్లీమార్నింగ్ నిశ్శబ్దపు వాతావరణంలో ప్రారంభిస్తారు. ఇందులో ధ్యానం, జర్నలింగ్, ప్రేయర్ లేదా నిశ్శబ్దంగా ఒక కప్పు టీని ఆస్వాదించడం, ప్రకృతిలో గడపడం వంటివి ఉంటాయి. ఈ నిశ్శబ్ద సమయం వారి మైండ్‌ను రీ ఫ్రెష్ చేయడానికి, ఆరోజుకు సంబంధించిన గోల్స్ లేదా ఉద్దేశాలను సెట్ చేయడానికి తగిన క్లారిటీని ఇస్తుందట. ఆ తర్వాత పనుల్లో నిమగ్నమైనా ఎంతో ఉత్సాహంగా ఉంటారు.

ప్రాధాన్యతా క్రమాలు, సందర్భాలు

అది బ్రిస్క్ వాక్, యోగా సెషన్ లేదా జిమ్ వర్కవుట్.. ఇలా ఏదైనా కావచ్చు. ఉదయాన్నే మీ శరీరాన్ని కదిలించడం వల్ల మీకు కావాల్సిన శక్తినిస్తుంది. మానసిక స్థితిని, జ్ఞాపకశక్తిని, మెదుడు పనితీరును మెరుగు పరుస్తుంది. ఇక వ్యాయామంవల్ల మీ శరీరం ఎండార్ఫిన్స్ అండ్ నేచుల్ మూడ్ ఎలివేటర్స్‌ను రిలీజ్ చేస్తుంది. అది మరింత అప్రమత్తంగా రోజువారీ సవాళ్లను పరిష్కరించడానికి దోహదం చేస్తుంది.

హెల్తీ బ్రేక్‌ ఫాస్ట్

హెల్తీ అండ్ న్యూట్రిషియస్ బ్రేక్‌ఫాస్ట్‌‌తో ఆ రోజును ప్రారంభించడంవల్ల ఆరోజుకు సంబంధించిన మీ ఎనర్జీ లెవల్స్, డెసిషన్ మేకింగ్ టోన్ అద్భుతంగా సెట్ అవుతుంది. మార్నింగ్ టైమ్ స్వీట్లు, ప్యాకేజింగ్ ఫుడ్స్, ఇతర చక్కెర పదార్థాలు పూర్తిగా మానేయండి. జొన్నరొట్టెలు, తైద రొట్టెలు లేదా సంపూర్ణ గోధుమ టోస్ట్ లేదా పండ్ల వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్‌లతో కలిపి గుడ్లు, పెరుగు లేదా సీడ్స్ రిలేటెడ్ ప్రోటీన్ అధికంగా ఉండే పదార్థాలను ఎంచుకోవడం మంచిది.

ప్లాన్ అండ్ స్ట్రాటజీస్

మీరు సక్సెస్‌ఫుల్ పీపుల్ లిస్టులో చేరాలంటే తగిన ప్రణాళికలు, వ్యూహాలు చాలా ముఖ్యం. ఉదయం పూట 10 నుంచి 15 నిమిషాలు అందుకోసం కేటాయిస్తే మీ వర్క్‌ ప్రొడక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. చేయవలసిన పనుల జాబితాను రూపొందించడం, టాస్క్‌లకు ప్రయారిటీ ఇవ్వడం, ఇంపార్టెంట్ మీటింగ్స్ లేదా అపాయింట్‌మెంట్స్ షెడ్యూల్ చేయడం వంటివి మీ ప్రణాళికలో భాగంగా ఉండవచ్చు. ఉదయంపూట ప్లాన్ చేయడం అనేది మీలో ఏకాగ్రతను పెంచుతుంది. రోజు గడుస్తున్న కొద్దీ ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి సహాయపడుతుంది.

కృతజ్ఞతా భావంతో ఉండండి

కృతజ్ఞతా భావాన్ని పాటించడం మీ మొత్తం శ్రేయస్సును, మానసిక దృక్పథాన్ని సానుకూలంగా మార్చేస్తుంది. మీ ఆరోగ్యం పట్ల, ప్రియమైన వ్యక్తులపట్ల, రుచికరమైన కప్పు కాఫీ పొందడంపట్ల ఇలా జీవితంలోని అనేక మంచి విషయాలకు కృతజ్ఞత తెలియజేయడానికి ప్రతి ఉదయం కొన్ని క్షణాలు తీసుకోండి. ఈ కామన్ యాక్ట్ మీ మైండ్ సెట్ మార్చేస్తుంది. మరింత సానుకూల భావాన్ని, ఆశావాద స్థితిని పెంచుతుంది.

టెక్ సమయాన్ని పరిమితం చేయండి

ప్రస్తుతం టెక్నాలజీ జీవితంలో భాగమైంది. చాలామంది పొద్దున్న లేవగానే మొబైల్ ఫోన్‌‌లోనో, డెస్క్ టాప్‌పైనో ఇ మెయిల్స్ చెక్ చేయడం, సోషల్ మీడియా స్ర్కోల్ చేయడం చేస్తుంటారు. దీనివల్ల మీ మనస్సు డైవర్ట్ అయ్యేఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎర్లీ మార్నింగ్ అందుకు బదులుగా మనస్సును ప్రశాంతంగా ఉంచగలిగే కార్యకలాపాలను ఎంచుకోండి. దీనివల్ల మీ ఎనర్జీ లెవల్స్, ప్రొడక్టివిటీ, మొత్తం శ్రేయస్సులో గణనీయమైన మెరుగుదల వస్తుంది. మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తుంది.

Read More..

అక్కడ పుట్టుమచ్చలు ఉండే అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. అత్తింటి వారికి డబ్బే డబ్బు



Source link

Related posts

అందరి చూపు ఈ ట్రాన్స్‌జెండర్ పక్షి వైపే.. ఎక్కడ గుర్తించారంటే..?

Oknews

చిన్నపిల్లలకు ఈ నూనెతో మసాజ్ చేస్తున్నారా.. వారి చర్మం దెబ్బతినట్టే..

Oknews

నెయిల్ పాలిష్ పెట్టుకుంటున్నారా.. పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడి!

Oknews

Leave a Comment