దిశ, ఫీచర్స్ : సన్నగా ఉండాలని ఎవరికి ఉంటుంది. చాలా మంది బొద్దుగా,లావుగా ఉండాలి అనుకుంటారు. కానీ దీనికోసం ఏవేవో తింటూ ఉంటారు. అయినా బరువు పెరగరు. ఇలా ఎంత తిన్నా సన్నగా ఉంటున్నామని చాలా బాధపడుతుంటారు. కానీ ఈ ఫుడ్ ఐటమ్స్‌ను మీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఈజీగా బరువుపెరుగుతారంట. ఇంతకీ ఆ ఫుడ్ ఏంటీ అనకుంటున్నారా?
వేరు శనగలు : రోజూ ఉదయం పూట నానబెట్టిన శనగలు ప్రతి రోజూ తినడం వలన చాలా ఈజీగా బరువు పెరగవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నల్ల శనగలు : నల్ల శనగల్లో కెలరీలు పుష్కలంగా ఉంటాయి. అందువలన వీటని కూడా రోజూ మీ డైట్‌లో చేర్చుకోవడం వలన మీరు బరువు పెరగవచ్చు.
అంజీర : అంజీర ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన వీటిని ప్రతి రోజూ మీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఈజీగా బరువు పెరుగుతారంట.
వాల్ నట్స్ : వాల్ నట్స్‌లో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. ఓమెగా 3 ఫ్యాటీయాసిడ్స్ వంటి కొవ్వులు ఉండటం వలన వీటనిమీ డైట్‌లో చేర్చుకోవడం వలన ఈజీగా బరువు పెరగవచ్చును.
ఖర్జూర : ఖర్జూర బరువు పెంచడంలో చాలా సహాయ పడుతుంది. ఇందులో దాదాపు 23 కెలరీలు, ఫైబర్ ఉంటుంది. అందువలన రోజూ దీనిని తినడం వలన ఈజీగా బరువు పెరుగుతారు.