Health Care

సపోటా పండు తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?


దిశ, వెబ్ డెస్క్: ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అంతేకాదు డైలీ లైఫ్ లో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక సవాలుగా మారింది. సీజనల్ వ్యాధులతో కాకుండా నిరంతరం ఏదో ఒక సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే మనం రోజు తీసుకునే ఆహారమే మన ఆరోగ్యన్ని నిర్ణయిస్తుంది. రోజువారీ జీవితంలో బిజీ బిజీగా ఉంటూ సమయానికి ఫుడ్ తీసుకోరు. దాని ఎఫెక్ట్ ఆరోగ్యంపై చూపుతుంది. అందువల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. అలాగే హెల్దీగా ఉండాలంటే పండ్లు తప్పనిసరిగా తినాలి.

మనం రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్లు , ప్రోటీన్లు, అధికంగా ఉండేలా చూసుకోవాలి. మనకు సీజనల్ గా అందుబాటులో ఉండే పండ్లు తప్పకుండా తీసుకోవాలి. అందరికీ ఇష్టమైన పండ్లలో సపోటా ఒకటి. ఇది ఎక్కువగా వేసవిలో లభిస్తుంది. సపోటా పండులో ఎన్నో విటమిన్స్ ఉంటాయి. ఈ పండు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా. ఇది చూడటానికి చిన్నగా ఉన్న దీంట్లో అధిక సంఖ్యలో పోషకాలు ఉంటాయి. సపోటా పండ్లలో విటమిన్లు బి, సి, ఇ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్ గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలైనది.

సపోటా పండు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..అవి ఏంటో చూద్దాం..

రోజు ఈ ఫ్రూట్ ని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంలో దోహదపడుతుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని క్రమబద్ధం చేస్తుంది. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇవి తినడం వల్ల ఆకలి తగ్గుతుంది. రోజు భోజనం చేశాక ఒక సపోటా తింటే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్లు -ఫైబర్- యాంటీ ఆక్సిడెంట్లతో జీర్ణశక్తి మెరుగవుతుంది. ఎందుకంటే కడుపులో మంటను తగ్గించడమే కాకుండా జీర్ణక్రీయ ను సులభతరం చేస్తుంది. మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి ఈ పండు తినడం వల్ల ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.వ్యాయామం చేసి అలసిపోయిన వారు ఈ పండు తింటే వారికి శక్తి లభిస్తుంది. మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు కోల్పోయిన శక్తిని ఈ పండు తినడం వల్ల తిరిగి పొందవచ్చు. శీతాకాలం, వేసవి కాలంలో మీ చర్మ సౌందర్యంలో మార్పులు జరుగుతాయి. ఈ పండ్లు తీసుకోవడం వల్ల చర్మ సమస్యలు దూరం పెట్టవచ్చు. ఎందుకంటే సపోటాలోని విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మ రక్షణకు సహాయపడుతాయి. అందువల్ల ఆరోగ్యంగా ఉండడానికి రోజుకు ఒక సపోటా అయిన తినండి. పిల్లలు కూడా తినిపించండి. అయితే కొందరికి ఈ పండు తినడం ఇష్టం ఉండకపోవచ్చు . అటువంటి సమయంలో ఈ ఫ్రూట్ ని జ్యూస్ లా తీసుకోండి. ఆరోగ్య నిపుణులు ఈ పండ్లను జ్యూస్ ప్రిపెర్ చేసుకొని తాగిన ఆరోగ్యానికే మంచిదే అంటున్నారు



Source link

Related posts

బరువు తగ్గేందుకు రాత్రిపూట డిన్నర్ మానేస్తున్నారా.. ప్రమాదంలో పడినట్టే

Oknews

పిల్లల ఎదుగుదలలో ఆ సమస్యలకు కారణం అవుతున్న పేరెంట్స్.. ఎలా అంటే?

Oknews

Cranberries: యూరిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారా? టాబ్లెట్ కంటే ఫాస్ట్‌గా రిజల్ట్ చూపే ఈ పండు తినండి!

Oknews

Leave a Comment