సబితపై రేవంత్ కు ఎందుకు అంత పగ! Great Andhra


తెలంగాణ అసెంబ్లీలో మ‌హిళ‌ల ఎమ్మెల్యేల‌పై సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డిని దృష్టిలో పెట్టుకొని వెన‌కాల ఉండే అక్క‌లు.. ఇక్క‌డి ఉండి మాకు చెప్పి.. చెప్పి ఇక్క‌డ ముంచి అక్క‌డ తేలారు. ఆ అక్క‌లు మాటలు మీరు(బీఆర్ఎస్ పార్టీ) వింటే జూబ్లీ బ‌స్‌స్టాండ్‌లో కూర్చోవాల్సి వ‌స్తుంది సెటైర్ వేశారు.

స‌బితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ రేవంత్ న‌న్ను ఎందుకు టార్గెట్ చేశాడ‌ని ప్ర‌శ్నించారు. గ‌తంలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి సంతోషంగా ఆహ్వానించి.. కాంగ్రెస్ పార్టీకి ఆశా కిర‌ణం అవుతాడాని.. సీఎం అవుతావ‌ని కూడా ఆనాడే చెప్పి మ‌న‌స్ఫూర్తిగా ఆశీర్వ‌దించిన త‌నపై రేవంత్ రెడ్డి క‌క్ష పెట్టుకున్నాడ‌ని అవేద‌న వ్య‌క్తం చేశారు.

స‌బితా ఇంద్రారెడ్డి వ్యాఖ్య‌ల‌పై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. త‌న‌ను స‌బిత‌క్క కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన మాట నిజ‌మేన‌ని.. తాను కూడా స‌బిత‌క్కాను సొంత అక్క‌లాగా అనుకున్నాన‌ని.. కొడంగ‌ల్‌లో ఎమ్మెల్యేగా ఓడిపోతే హైక‌మాండ్‌కు చెప్పి మ‌ల్కాజ్ గిరి ఎంపీగా పోటీ చేసే అవ‌కాశం క‌ల్పించింద‌ని.. కానీ కేసీఆర్ మాయ మాట‌ల‌ను నమ్మి ఆనాడు టీఆర్ఎస్‌లో చేరి త‌న ఓట‌మి కోసం ప్ర‌య‌త్నించింద‌ని.. వెన‌కాల‌నే ఉండే అక్క‌లు ముంచుతార‌న్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య‌లపై బీఆర్ఎస్ ఖండిచ‌డంతో.. రేవంత్ రెడ్డి ఎవ‌రి గురించి మాట్లాడ‌లేద‌నికేవ‌లం ఒక సూచ‌న‌, స‌ల‌హా మాత్ర‌మే ఇచ్చార‌న్నారు మంత్రి శ్రీధ‌ర్ బాబు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మాజీ మంత్రి హారీష్ రావు ట్వీట్ట‌ర్ వేదిక‌గా కౌంట‌ర్ ఇచ్చారు.. నిండు అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సభానాయకులు, రేవంత్ రెడ్డి గారు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది యావత్ మహిళా లోకానికి జరిగిన అవమానం. ముఖ్యమంత్రి గారు వెంటనే బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అసెంబ్లీ సమావేశాలు ఎంతో హుందాగా నిర్వహించాం. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ, ప్రతిపక్షాల గొంతును నొక్కుతూ కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరి గర్హనీయం. అంటూ ట్వీట్ చేశారు.



Source link

Leave a Comment