EntertainmentLatest News

సమంత ని అరెస్ట్ చెయ్యాలంటున్న డాక్టర్స్..లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం 


ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (samantha)పై డాక్టర్లు ఫైర్ అవుతున్నారు. నువ్వు యాక్టర్ వి డాక్టర్ వి కాదు. అనవసరంగా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడద్దు అని చెప్తున్నారు. ప్రజలకి కూడా సమంత మాటలు వినద్దని హితవు చెప్తున్నారు. అసలు  విషయం ఏంటో చూద్దాం.


సమంత ఇటీవల ఒక వీడియో ని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.  వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజ్ ని  పీల్చడం ద్వారా ఉపశమనం పొందవచ్చని అందులో  చెప్పింది. పైగా ఆ ప్రాసెస్ ని తను పాటించింది. ఇప్పుడు ఈ విషయం మీదే డాక్టర్స్ ఫైర్ అవుతున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్  అనేది ఒక అన్ స్టేబబుల్ రసాయనం. ఇది నీరు మరియు ఆక్సిజన్ గా మారుతుంది. అయితే ఈ ఆక్సిజన్ అణువులుగా మారేముందు అంటే పరమాణువులుగా ఉన్నప్పుడు ఫ్రీ రాడికల్స్ గా  పని చేస్తుంది.దాంతో  అప్పటికే వైరస్ వలన దెబ్బతిన్న ఊపిరితిత్తుల లోపలి పలుచని పొరల్ని బాగా దెబ్బ తీస్తుంది. దీంతో  న్యుమోనియాకి  గానీ, ఏక్యూట్ రెస్పిటేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కి గానీ దారి తీస్తుంది. ఇదే నిజమైతే ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదు.  డైరెక్టుగా మనిషి మరణానికి గురువవుతాడని చెప్తున్నారు.

తెలిసి తెలియని అవగాహనతో   సమంత  ప్రజల ఆరోగ్యాలతో   చెలగాటమాడుతుందని,  పోలీసు కేసు నమోదు చేసి తనని  జైలు కి పంపించాలని  అంటున్నారు.  కొంత మంది   వైద్య నిపుణులు మాత్రం  సమంత తన సూచనని  మంచి ఉద్దేశ్యంతోనే చేసినప్పటికీ, ఆమె మిలియన్ల మంది ఫాలోవర్లను ప్రమాదంలో పడేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సమంత మాత్రం తన వైఖరిని మార్చుకోవడానికి ఇష్టపడటం లేదు.  మరి తను ఆ వైద్యం ఎక్కడ నేర్చుకుందో ఏమో. చాలా గట్టిగానే తన మాట మీద ఉంది.

 


 



Source link

Related posts

హమ్మయ్య విక్రమ్ మూవీ వచ్చేస్తోంది!

Oknews

'ప్రతినిధి 2' వాయిదా.. కారణం అదేనా?…

Oknews

Mega couple enjoying vacation వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న మెగా కపుల్

Oknews

Leave a Comment