EntertainmentLatest News

సమంత ఫ్యాన్స్ కి బిగ్ సర్ ప్రైజ్.. ఆ టాప్ స్టార్ తో…


టాప్ స్టార్స్ కి జోడిగా సమంత(Samantha) నటించి చాలా కాలమైంది. గత కొన్నేళ్లుగా ఆమె ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు చేయడమో లేక యంగ్ స్టార్స్ పక్కన నటించడమో చేస్తూ వచ్చింది. ఇక అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలంగా సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది. అలాంటి సమంత ఇప్పుడు షార్ట్ గ్యాప్ తో తెలుగులో అదిరిపోయే రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పక్కన నటించే అవకాశాన్ని ఆమె దక్కించుకున్నట్లు సమాచారం.

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. బన్నీ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత ఫైనల్ అయినట్లు వినికిడి. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో.. సౌత్ తో పాటు, నార్త్ లోనూ మంచి గుర్తింపు ఉన్న సమంత హీరోయిన్ గా పర్ఫెక్ట్ ఛాయిస్ అని భావించి మూవీ టీం ఆమె పేరు ఖరారు చేశారట.

అల్లు అర్జున్, సమంత కాంబినేషన్ లో గతంలో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా వచ్చింది. అందులో వీరి జోడి మెప్పించింది. అలాగే ‘పుష్ప’ చిత్రంలో ‘ఊ అంటావా మావా’ స్పెషల్ సాంగ్ లో చిందేసి ఒక ఊపు ఊపింది సమంత. ఓ వైపు విడాకులు, మరోవైపు అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్న సమయంలో సమంతకు ఆ పాట కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు మరోసారి బన్నీ సరసన నటించడానికి రెడీ అవుతుందట. కాగా డైరెక్టర్ అట్లీ తోనూ సమంత ‘తేరి’, ‘మెర్సల్’ అనే రెండు సినిమాలు చేసింది. ఇప్పుడిది వారి కలయికలో మూడో ప్రాజెక్ట్ అవుతుంది. 

మరోవైపు ఈ సినిమాలో సమంతతో పాటు త్రిష కూడా అలరించనుందని న్యూస్ వినిపిస్తోంది. ఏప్రిల్ 8న దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.



Source link

Related posts

Lavnya జిమ్ లో మెగా చిన్నకోడలి విన్యాసాలు

Oknews

Siri about Shanmukh personal life షణ్ముఖ్ లైఫ్ అలా అవుతుందనుకోలేదు: సిరి

Oknews

Ram Charan fans showed love చరణ్ కి చుక్కలు చూపించిన అభిమానులు

Oknews

Leave a Comment