హీరోయిన్ సమంత నుంచి మరో యాక్షన్ ప్రాజెక్టు రెడీ అయింది. ఆమె అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సిటాడెల్ ఇండియన్ వెర్షన్ స్ట్రీమింగ్ డేట్ బయటకొచ్చింది. నవంబర్ 7 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమ్ అవుతుంది.
ఈ మేరకు సిటాడెల్ హనీ-బన్నీ టీజర్ ను రిలీజ్ చేశారు. పూర్తిగా యాక్షన్ లుక్ లో సమంతను ఆవిష్కరించింది ఈ టీజర్. రాత్ బాకీ అనే సూపర్ హిట్ సాంగ్ పై ఈ టీజర్ ను కట్ చేయడం బాగుంది.
ఇంతకుముందు రాజ్-డీకేతో కలిసి ఫ్యామిలీ మేన్ సీజన్-2లో నటించింది సమంత. అందులో ఆమెను మహిళా ఉగ్రవాదిగా నెగెటివ్ షేడ్స్ లో చూపించారు. సిటాడెల్ హనీ-బన్నీ లో మాత్రం సమంత స్టయిలిష్ యాక్షన్ లుక్ లో పాజిటివ్ క్యారెక్టర్ లో కనిపిస్తోంది.
హీరో వరుణ్ ధావన్, హీరోయిన్ సమంత పెయిర్ చూడ్డానికి బాగుంది. ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయనే విషయాన్ని టీజర్ తో చెప్పకనే చెప్పారు.
మయొసైటిస్ నుంచి కోలుకున్న తర్వాత సమంత నుంచి వస్తున్న ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. అందుకే దీనిపై ఓ వర్గంలో క్రేజ్ ఉంది.