ఒక వైపు సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ మూవీస్,పాన్ ఇండియా చిత్రాలను లైన్ పెడుతోన్న బ్యూటీ డాల్ రష్మిక మందన్న. ఈ శాండిల్ వుడ్ క్యూట్ బేబీ రీసెంట్‌గా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. అందులో భాగంగానే రెయిన్ బో అనే ఉమెన్ సెంట్రిక్ మూవీలో ఆమె నటిస్తోంది. ఇది కాకుండా మరో మహిళా ప్రాధాన్యతా చిత్రానికి రష్మిక ఓకే చెప్పినట్లు మీడియా సర్కిల్స్ సమాచారం. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ సినిమాను సమంత స్నేహితుడు తెరకెక్కించబోతున్నారు. ఇంతకీ ఆ స్నేహితుడు ఎవరో కాదు.. రాహుల్ రవీంద్రన్. నటుడిగా తన కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈయన చి.ల.సౌ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ సినిమా సూపర్ హిట్ కావటంతో పాటు అవార్డును కూడా సాధించి పెట్టింది.
చి.ల.సౌ తర్వాత రాహుల్ రవీంద్రన్‌కు ఏకంగా నాగార్జున అక్కినేని ఛాన్స్ ఇచ్చారు. అదే మన్మథుడు 2. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవటంతో డైరెక్టర్‌కు అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఈ సినిమా 2019లో విడుదలైంది. నాలుగేళ్లుగా రాహుల్ మరో సినిమా చేయలేదు. అయితే సినిమా రాలేదా? నిజానికి ఈయన దర్శకత్వంలో మూవీ 2020లో తెరకెక్కాల్సింది. కానీ కరోనా ప్రభావంతో దాదాపు రెండేళ్లు సినీ ఇండస్ట్రీ వెనుక పడింది. తర్వాత రష్మిక చేతిలో ఉన్న కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి. దీంతో ఆమె ప్రధాన పాత్రలోరాహుల్ రవీంద్రన్ చేయాల్సిన సినిమా ఆలస్యమైందని మీడియా టాక్.
రష్మిక మందన్న విషయానికి వస్తే ఆమె కథానాయికగా నటించిన యానిమల్ మూవీ డిసెంబర్ 1న రిలీజ్ అవుతుంది. మరో వైపు పాన్ ఇండియా మూవీ పుష్ప 2 దిరూల్ ఆగస్ట్ 15న రిలీజ్ కానుంది. రెయిన్ బో సినిమా సెట్స్ పై ఉంది. శాంతన్ రూబెన్ డైరెక్షన్ చేస్తోన్న ఈ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్.ప్రభు, ఎస్.ఆర్. ప్రకాష్ నిర్మిస్తున్నారు.