విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారకరామారావు(ntr)ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు.సమాజమే దేవాలయం. ప్రజలే దేవుళ్ళు అని. ఆ మాట అక్షర సత్యం కూడా. ఇప్పుడు రీసెంట్ గా ఒక భారీ నిర్మాత కూడా అదే మాట చెప్తున్నాడు.
సూర్యదేవర నాగ వంశీ(naga vamsi)అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ అధినేత. హిట్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్స్ . రీసెంట్ గా టిల్లు స్క్వేర్(tillu square)తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. ప్రసుతం విజయ్ దేవరకొండ(vijay devarakonda)తో ఒక భారీ సినిమాని నిర్మిస్తున్నాడు. నానితో జర్సీ ని తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. మార్చి 28 న రిలీజ్ కాబోతుంది.ఇటీవల విడుదలైన దేవరకొండ లుక్ తో సినిమా మీద క్యూరియాసిటీ ని పెంచుతుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా దేవరకొండ తో పాటు ఫ్యాన్స్ కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ మూవీ విషయంలోనే నాగ వంశీ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసాడు. దర్శకుడు గౌతమ్ రాసుకున్న కథ చాలా విసృతమైనది. రెండవ పార్ట్ కి కూడా కథ ఉంది. కాకపోతే మూవీ విజయవంతమైతే రెండవ పార్ట్ కూడా ఉంటుందని చెప్పాడు. సో ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తేనే రెండవ పార్ట్ వస్తుందని వంశీ చెప్పినట్టు అయ్యింది.
ఇక వంశీ తన మాటలతో ఒక కొత్త ట్రెండ్ ని కూడా పరిచయం చేసినట్టయ్యింది. ఈ మధ్య కాలంలో మొదటి పార్ట్ రిలీజ్ కాకుండానే సెకండ్ పార్ట్ కూడా ఉందని అనౌన్స్ చేస్తున్నారు. దీంతో మొదటి భాగం విజయవంతం కాకపోతే అనవసరమైన టెన్షన్స్ ని ఎదుర్కోవలసి వస్తుంది.అలా కాకుండా సినిమా విజయవంతమైతేనే సెకండ్ పార్ట్ రావడం అందరకి మంచిది. మరి ముఖ్యంగా నిర్మాతకి.