దిశ, ఫీచర్స్: ఇప్పటికే భానుడి భగభగకు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దాంతో పాటు ఇప్పుడు ఏప్రిల్ నెల కూడా స్టార్ట్ అయింది. ఇక ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే.. ఈ ఎండల కారణంగా చాలా మంది అధిక చెమటతో బాధపడుతుంటారు. బయటకు వెళ్లిన, ఇంట్లో ఉన్న చెమటలు మాత్రం విపరీతంగా పడుతుంటాయి. ఈ చెమట తడికి బట్టలు తడిచిపోయి చిరాకు రావడంతో పాటు.. విపరీతమైన దుర్వాసన కూడా వస్తుంది. దీంతో ఎక్కడికైన వెళ్లాలన్న, ఎవరి పక్కనైనా కూర్చోవాలన్న ఇబ్బంది పడుతుంటారు. అయితే.. ఈ దుర్వాసన నుంచి తప్పించుకోవాలి అనుకుంటున్నారా. మరి ఇంకెందుకు ఆలస్యం మీ ఇంటి చిట్కాలతో అధిక చెమట, దుర్వాసన నుంచి విముక్తులు కండి.
* సమ్మర్‌లో చమట నుంచి విముక్తి చెందాలంటే ఎక్కువగా శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం అవసరం. ఈ మేరకు ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉండాలి.
* ముఖ్యంగా వేసవిలో ఎక్కువగా కాటన్ దుస్తులు ధరించేందుకు ప్రయత్నించండి. అవి చెమటను పీల్చుకుని శరీరానికి చల్లదానాన్ని ఇస్తాయి.
* ఎక్కువగా అలసిపోకుండా నిదానంగా పనులు పూర్తి చేసుకోంది. అలాగే వ్యాయామం చేసే వాళ్లు ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ చెయ్యడం మంచిది.
* వాటర్‌లో వేప ఆకులు లేదా వేప నూనె వేసుకుని స్నానం చెయ్యాలి. వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని బ్యాక్టీరియా నుంచి రక్షించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా చెమట వల్ల వచ్చే దురదను, దుర్వాసనను తగ్గిస్తాయని చెబుతున్నారు నిపుణులు.
* అలాగే నీటిలో గులాబీ రేకులు వేసుకుని స్నానం చేసిన మంచి ఫలితం ఉంటోంది. ఇవి చెమట దుర్వాసనను తగ్గించడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.