దిశ, ఫీచర్స్: చూస్తుండగానే ఎండలు మండిపోతున్నాయి. మార్చి మొదటి వారం నుంచే సూర్యుడు భగభగలకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే మార్చి చివరికి వచ్చే సరికి ఎండల తీవ్రత మరింత పెరగడంతో అంతా శరీరాన్ని చల్లబరచుకునేందుకు ట్రై చేస్తున్నారు. అయితే సమ్మర్ వచ్చిందంటే చాలు చిన్నా పెద్ద ఐస్‌క్రీములు తింటూ ఎంజాయ్ చేస్తుంటారు.
ముఖ్యంగా చిన్న పిల్లలు బయటకు ఎక్కడికి వెళ్లినా సరే ఐస్‌క్రీమ్ ఇప్పియ్యమని మారాం చేస్తుంటారు. అంతేకాకుండా కొంతమేరకు ఇంటికి కూడా తీసుకెళ్దామని గోల చేస్తుంటారు. దీంతో రెండు మూడు రోజులకు సరిపడా తల్లిదండ్రులు ఒక పెద్ద డబ్బాను విక్రయించి ఇంట్లో ఫ్రిడ్జ్‌లో పెట్టి పిల్లలు అడిగినప్పుడల్లా ఇస్తుంటారు. అయితే పిల్లలు ఐస్‌క్రీమ్ తినడం వల్ల ప్రమాదం పొంచి ఉందని నిపుణులు సూచిస్తున్నారు. దీనిని తింటే పలు అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుందని అందుకే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
* ముఖ్యంగా పిల్లలు ఐస్‌క్రీమ్ తినడం వల్ల ఇందులో అధికంగా ఉండే చక్కెరలు, కొవ్వు కారణంగా చిన్నారుల మెదడుపై ప్రభావం పడుతుంది. దీంతో మెమరీ పవర్ తగ్గిపోయే అవకాశం ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైనట్లు సమాచారం.
* అంతేకాకుండా పిల్లలు ఐస్‌క్రీమ్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం, దగ్గు, జ్వరం, కఫం, గొంతు ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వస్తాయి.
*మరీ ముఖ్యంగా అధిక బరువుతో ఉన్న చిన్నారులు ఐస్‌క్రీమ్‌కు దూరంగా ఉండటమే మంచిది. లేదంటే.. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగి అనారోగ్య సమస్యలు వస్తాయి.
* అయితే ఐస్‌క్రీమ్ తినడం వల్ల కొంత మంది చిన్నారుల్లో తలనొప్పి కూడా వేధించే అవకాశం ఉందట. అలాగే దంతాల బ్యాక్టీరియా పెరిగి దంత క్షయం వస్తుంది.
* ఐస్‌క్రీమ్ పలు రకాల రంగులతో చిన్న పిల్లలను ఆకర్షిస్తాయి. అయితే ఇందులో ఉపయోగించే కొన్ని కెమికల్స్ చిన్నారులకు టాన్సిల్స్ వచ్చేలా చేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
*అయితే పిల్లలు ఐస్‌క్రీమ్స్ తినకుండా ఉండలేక కొనివ్వమని తెగ మారాం చేస్తే ఇంట్లో అందుబాటులో ఉండే వాటితో మీరే తయారు చేసి ఇవ్వడం మంచిది. లేకపోతే పాలు, చెర్రీస్, డ్రై ఫ్రూట్స్, పండ్లు వంటి వాటితో వెరైటీ గా హెల్తీగా చేసి పెట్టడం ఆరోగ్యకరంగా ఉంటుంది.