Health Care

సమ్మర్‌లో శక్తికి మించిన వ్యాయామాలతో నష్టం.. ఏం జరుగుతుందంటే..


దిశ, ఫీచర్స్ : వ్యాయామం ఆరోగ్యానికి మంచిదే కానీ, సమ్మర్‌లో ఎక్కువసేపు వ్యాయామాలు చేయడం మాత్రం అనర్థదాయకం అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వేసవిలో కేర్‌ఫుల్‌గా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మిగతా సీజన్లతో పోల్చినప్పుడు సమ్మర్‌లో బయటి ఉష్ణోగ్రతలు, బాడీ టెంపరేచర్ అధికంగా ఉంటాయి. హెచ్చు తగ్గులకు గురవుతుంటాయి. వర్కవుట్స్ చేసే క్రమంలో పలు మార్పులు సంభవిస్తాయి. అందుకే శక్తిమించి లేదా ఓవర్ టైమ్ వర్కవుట్స్ చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువసేపు వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారు తమ సమయాన్ని తగ్గించుకుంటే బెటర్ అంటున్నారు.

వేసవిలో ఫిట్‌నెస్ కోసం శక్తికి మించి వ్యాయామాలు చేయడంవల్ల శరీరం నుంచి చెమట అధికంగా బయటకు పోతుంది. ముఖ్యంగా నీటి శాతంతోపాటు సోడియం లెవల్స్ త్వరగా తగ్గే ప్రమాదం ఉంటుంది. దీని కారణంగా కళ్లు తిరగడం, చూపుల్లో తేడాగా అనిపించడం, తలనొప్పి వంటి ప్రాబ్లమ్స్ తలెత్తవచ్చు. యూఎస్ డిపార్టెమెంట్ ఆఫఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం అధిక ఉష్ణోగ్రతల మధ్య ఎక్కువ సేపు వ్యాయామాలు చేయడం డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు. అందుకే మిగతా సీజన్ల మాదిరి కాకుండా వేసవిలో వర్కవుట్స్ టైం టేబుల్ మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక డైలీ వర్కవుట్స్ టైమ్ తగ్గించడంతోపాటు ఉదయం ఏడు లోప పూర్తి చేయడం బెటర్.



Source link

Related posts

సామర్థ్యం ఉన్నా ప్రదర్శించలేని బలహీనత.. భయం నుంచి బయటపడలేమా?

Oknews

అద్భుతం : అండం, వీర్యం లేకుండానే బిడ్డకు జన్మ..ఎలా అంటే?

Oknews

బీరు ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. వేసవిలో ఎత్తిన బాటిల్ దించేదేలే..!

Oknews

Leave a Comment