దిశ,ఫీచర్స్:ఎండాకాలం వచ్చిందంటే చాలు చెమటలు పట్టేస్తుంటాయి. దీనికి తోడు ఈ సంవత్సరం ఎండలు ఇంకా పెరిగిపోతున్నాయి.ఈ విపరీతమైన ఎండలకు సహజంగానే చెమటలు వస్తాయి. దీంతో చెమట దుర్వాసన వేధిస్తుంటుంది. అయితే శరీర చమట ద్వారా వచ్చే దుర్వాసనను కంట్రోల్ చేయడానికి పర్‌ఫ్యూమ్‌లు అందుబాటులో ఉన్నాయి. మరి షూ ల నుంచి వచ్చే దుర్వాసన సంగతి ఏంటి?సాధారణంగా షూల నుంచి వచ్చే దుర్వాసన దారుణంగా ఉంటుంది. చలికాలంలోనే వీటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. అలాంటిది మరి ఎండ కాలంలో, విపరీతమైన చెమట వచ్చే రోజుల్లో షూల నుంచి వచ్చే వాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ దుర్వాసనకు ఎలా చెక్ పెట్టాలి.? ఇందుకోసం పాటించాల్సిన నేచురల్ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
*బూట్లను గోరువెచ్చని నీటితో శుభ్రం చేయడం వలన దాని నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించవచ్చు.
*రాత్రిపూట షూస్ లో కాస్త బేకింగ్ సోడాను వేయాలి. ఇది షూ లోపల ఉండే చెమట వాసనను పీల్చుకుంటుంది. అలాగే సూక్ష్మ క్రిములు పెరగకుండా అడ్డుకుంటుంది. ఆ బేకింగ్ సోడాని ఉదయం పడేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే షూల నుంచి వాసన రావడం తగ్గుతుంది.
* 2 కర్పూరం బిళ్ళలను రాత్రి పూట షూస్ లో వేయడం వలన షూల నుంచి వచ్చే దుర్వాసన తగ్గుతుంది.
*షూస్ ధరించే ముందు పాదాలను బేకింగ్ సోడ నీటిలో 10 నిమిషాలు ఉంచాలి. ఇలా చేయడం వల్ల పాదాల నుంచి వచ్చే చెమట, దుర్వాసన తగ్గుతుంది. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే సరిపోతుంది.
* అలాగే అరబకెట్ గోరువెచ్చని నీటిలో అర కప్పు, వెనిగర్ అందులో పాదాలను 15 నిమిషాలు ఉంచండి. ఇలా వారానికి ఒక మూడు సార్లు చేస్తే పాదాల నుంచి వచ్చే దుర్వాసన వస్తుంది. కాబట్టి షూలను శుభ్రంగా ఉంచుకోవడం తో పాటు పాదాలు కూడా శుభ్రంగా ఉంచుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.