పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సలార్’. హాంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగం సీజ్ ఫైర్ ఈ ఏడాది డిసెంబర్ 22న విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మొదటి భాగం ట్రైలర్ కి సంబంధించి ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. ట్రైలర్ 1, ట్రైలర్ 2 పేరుతో రెండు ట్రైలర్లు విడుదల చేయనున్నారట మేకర్స్ . ఇప్పటికే ట్రైలర్ 1 రిలీజ్ డేట్ కూడా లాక్ అయినట్లు తెలుస్తోంది.
ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అక్టోబర్ 23న సలార్ ట్రైలర్ ను విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారట. అదే సమయంలో దసరా కావడం విశేషం. ఇక రెండో ట్రైలర్ ను సినిమా విడుదలకు కొద్దిరోజుల ముందు విడుదల చేయనున్నారట. అక్టోబర్ 23న సలార్ ట్రైలర్ తో పాటు ప్రభాస్ నటిస్తున్న పలు సినిమాల అప్డేట్స్ వచ్చే అవకాశముంది.