EntertainmentLatest News

సస్పెన్స్‌లో ఎన్టీఆర్‌ సినిమా, ‘సలార్‌2’.. ప్రశాంత్‌ నీల్‌ నెక్స్‌ట్‌ స్టెప్‌ ఏమిటి?


ప్రభాస్‌తో ‘సలార్‌’ వంటి మాస్‌ హిట్‌ తీసిన తర్వాత ప్రశాంత్‌ నీల్‌ అయోమయంలో పడిపోయాడు. ‘సలార్‌2’ మే లోనే స్టార్ట్‌ అవుతుంది అన్నారు. కానీ, దాని ఊసు ఎత్తడం లేదు ప్రశాంత్‌. మరోపక్క ఎన్టీఆర్‌తో అతను చేయబోయే సినిమా షూటింగ్‌ ఆగస్ట్‌లో ప్రారంభమవుతుందని మైత్రి మూవీ మేకర్స్‌ అధినేతలు గతంలోనే ప్రకటించారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘దేవర’ చిత్రాన్ని ఫినిష్‌ చేసే పనిలో ఉన్నాడు. చివరి షెడ్యూల్‌తోపాటు రెండు పాటలు కూడా బ్యాలెన్స్‌ ఉన్నాయి. ఆ సినిమాకి సంబంధించిన వర్క్‌ అంతా పూర్తి చేసుకొని ఆగస్ట్‌ రెండో వారంలో ముంబై వెళ్లిపోవడానికి ప్లాన్‌ చేసుకున్నాడు ఎన్టీఆర్‌. హృతిక్‌ రోషన్‌తో కలిసి తను చేసే ‘వార్‌2’ చిత్రం షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. 

మైత్రి సంస్థ మొదట ప్రకటించినట్టుగా ప్రశాంత్‌ నీల్‌ సినిమా ఆగస్ట్‌లో స్టార్ట్‌ అవ్వాల్సి ఉంది. దాన్ని పక్కన పెట్టి ఎన్టీఆర్‌ ‘వార్‌2’ షూటింగ్‌కి వెళ్లిపోవడానికి సిద్ధపడడం అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ‘సలార్‌’ రిలీజ్‌ అయి 7 నెలలు గడిచిపోయింది. కానీ, ఇప్పటివరకు ‘సలార్‌2’కి సంబంధించిన అప్‌డేట్‌గానీ, ఎన్టీఆర్‌ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందనే సమాచారంగానీ లేదు. మరి ఈ విషయంలో ప్రశాంత్‌ నీల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఏ ప్రాజెక్ట్‌పై ఫోకస్‌ చేస్తాడనే విషయంలో సస్పెన్స్‌ నెలకొంది. ఏది ఏమైనా తన నెక్స్‌ట్‌ సినిమా విషయంలో ప్రశాంత్‌ ఎలాంటి స్టెప్‌ వెయ్యబోతున్నాడు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 



Source link

Related posts

తానే దగ్గరుండి అంతా ప్లాన్ ప్రకారం చేసింది: డైరక్టర్ క్రిష్

Oknews

పొలిటికల్ పార్టీ మీటింగ్ లో రామ్ చరణ్..ఫ్యాన్స్ అసహనం

Oknews

గేమ్‌ స్టార్ట్‌ చేసాం..మా గేమ్‌ను ప్రేక్షకులే గెలిపించాలి : గీతానంద్‌

Oknews

Leave a Comment