GossipsLatest News

సాఫ్ట్ గా వద్దు.. మాస్ అవతారమెత్తాల్సిందే!


ఇకపై సాఫ్ట్ కేరెక్టర్స్ వేస్తే కుదరదు.. ఐరెన్ వంచాల్సిందే, మాస్ అవతారమెత్తాల్సిందే అంటూ రౌడీ ఫాన్స్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కి సలహాలిస్తున్నారు. లైగర్ విషయం పక్కన పెట్టెయ్ అన్నా.. ఖుషిలోలా, ఫ్యామిలీ స్టార్ లోలా ఇలా సాఫ్ట్ గా, ఫ్యామిలీ మ్యాన్ లా కనిపిస్తే ఇకపై కుదరదు.. ఇక మాస్ కేరెక్టర్స్ ఎంచుకో.. అప్పుడే వర్కౌట్ అవ్వుద్ది అంటూ ఉచిత సలహాలు పడేస్తున్నారు. 

ఖుషి, ఫ్యామిలీ స్టార్ చిత్రాల్లో లుక్స్ విషయంలో విజయ్ దేవరకొండ నిజంగా సాఫ్ట్ గా చాలా బాగా అనిపించాడు. కానీ అంత సాఫ్టుగా ఉంటే ఓ వర్గం ఆడియన్స్ కి నచ్చడం లేదు. విజయ్ దేవరకొండ కి ఓ మాస్ చిత్రం పడితే అతని కెరీర్ ఎక్కడికో పోతుంది అని మాట్లాడుతున్నారు. ఏదో ఒక స్టార్ డైరెక్టర్ చేతిలో పడినా కుదురుకుంటాడని అంటున్నారు. మరోపక్క సుకుమార్ తో విజయ్ దేవరకొండ చెయ్యాల్సిన ప్రాజెక్ట్ ఆగిపోయిందా.. హోల్డ్ లో ఉందా.. అనేది అర్ధం కావడం లేదు. 

ఒక్క స్టార్ డైరెక్టర్ విజయ్ దేవరకొండ సినిమా అనౌన్సమెంట్ వస్తే చాలు విజయ్ దేవరకొండ పేరు మళ్ళి ట్రెండ్ అవుతుంది అనేది అభిమానుల కోరిక. ఇక విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ తో ఎప్పటికప్పుడు తన అభిమానులనే కాదు ఫ్యాషన్ ప్రియులని సైతం ఆకట్టుకుంటాడు. ఆ ఫ్యాషన్ లోను ఎక్కువగా మాస్ స్టయిల్ ఉండాలని రౌడీ ఫాన్స్ కోరుకుంటున్నారు. అప్పుడే విజయ్ పరాజయాల నుంచి కోలుకుంటాడనేది వారి అభిమతం. 



Source link

Related posts

'దేవర' వర్సెస్ 'సలార్'.. బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్!

Oknews

Yanamala Ramakrishnudu Comments On AP Cabinet టీడీపీ సీనియర్స్ అంతా ఒకటే మాట

Oknews

ఆస్కార్: అవార్డులన్నీ ఆ చిత్రానికే

Oknews

Leave a Comment