EntertainmentLatest News

సాయిపల్లవితో మళ్ళీ సినిమా చేయకపోవడానికి రీజన్‌ అదేనంటున్న వరుణ్‌!


సినిమా ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్స్‌ బాగానే వర్కవుట్‌ అవుతాయి. ముఖ్యంగా కాంబినేషన్స్‌ విషయంలో చాలా రకాల సెంటిమెంట్స్‌ ఉంటాయి. ఒక సినిమా హిట్‌ అయితే, అందులో నటించిన హీరో, హీరోయిన్‌ను మరో సినిమాలో రిపీట్‌ చేయడం చూస్తుంటాం. అలా ఎక్కువ సినిమాల్లో కలిసి నటించిన జంటలు ఉన్నాయి. ఆమధ్య వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి జంటగా వచ్చిన ‘ఫిదా’ ఎంత పెద్ద హిట్‌ అయిందో అందరికీ తెలిసిందే. ఆరడుగులకు మించి హైట్‌లో వుండే వరుణ్‌తేజ్‌, సాధారణ హైట్‌ కంటే తక్కువ ఉండే సాయిపల్లవి జంటను ఆడియన్స్‌ యాక్సెప్ట్‌ చేశారు. ఆ సినిమాలో వారిద్దరి మధ్య కెమెస్ట్రీ కూడా బాగా వర్కవుట్‌ అయింది. ఈ సినిమా రిలీజ్‌ అయి 7 సంవత్సరాలు కావస్తోంది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. మళ్ళీ వరుణ్‌, సాయిపల్లవి కలిసి నటిస్తే బాగుంటుందన్న అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. సోషల్‌ మీడియాలో కూడా ఈ జంట మళ్ళీ స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలంటూ నెటిజన్లు కోరుతున్నారు. 

ఇటీవల ఆపరేషన్‌ వాలెంటైన్‌కి సంబంధించి జరిగిన మీడియా ఇంటరాక్షన్‌లో ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది. దానికి వరుణ్‌తేజ్‌ సమాధానమిస్తూ ‘ఫిదా’ తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి సినిమా చేస్తే బాగుంటుందని అనుకున్నాను. ఆమధ్య ఆ ప్రపోజల్‌ వచ్చింది. కానీ, తమ మా ఇద్దరికీ కథ నచ్చలేదు. అందుకే దానికి నో చెప్పాం. ఆ కథ విన్న తర్వాత ఏ విధంగానూ ‘ఫిదా’ను మించి లేదు. ఇద్దరికీ పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యే కథ వస్తే తప్పకుండా కలిసి నటిస్తాం. సాయిపల్లవితో కలిసి నటించేందుకు నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు’ అన్నాడు వరుణ్‌. ‘ఫిదా’ని తలదన్నే కథ దొరకాలంటే కష్టంతో కూడుకున్న పనే. కానీ, అసాధ్యమేమీ కాదు. మరి అలాంటి కథను తీసుకొచ్చి ఈ జంటను మెప్పించే దర్శకుడు ఎప్పుడొస్తాడో చూడాలి. 



Source link

Related posts

‘మెర్సీ కిల్లింగ్’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన హీరో ఆకాష్ పూరి!

Oknews

లవ్‌ విషయంలో అడ్డంగా బుక్‌ అయిన కిరణ్‌ అబ్బవరం!

Oknews

సఃకుటుంబనాం సెట్స్ లో మేఘా ఆకాశ్ పుట్టినరోజు వేడుకలు

Oknews

Leave a Comment