EntertainmentLatest News

సారా అలీఖాన్ మూవీ డైరెక్ట్ ఓటీటీలోకి.. రిలీజ్ ఎప్పుడంటే!


సైఫ్ అలీఖాన్ కూతురు ప్రధాన పాత్ర వహించిన ‘ ఏ వతన్  మేరే వతన్ ‘ మూవీ రిలీజ్ కి సిద్ధమైంది. ఈ సినిమాని కరణ్ జోహార్ నిర్మించారు.

భారత స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో ఎంతోమంది తమ ప్రాణాలని అర్పించారు. వారిలో కొందరు డైరెక్ట్ గా ఉద్యమంలో పాల్గొంటే మరికొంతమంది ఆ ఉద్యమకారులలో స్పూర్తిని నింపి పరోక్షంగా పాల్గొన్నారు. అండర్ గ్రౌండ్ లో ఓ రేడియో స్టేషన్ ని ఏర్పాటు చేసి, ఉద్యమకారులలో స్పూర్తిని నింపిన ఓ మహిళ కథే ఈ ‘ ఏ వతన్ మేరే వతన్ ‘. కరణ్ జోహార్ నిర్మించిన ఈ సినిమాకి కణ్ణన్ అయ్యర్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి రిలీజ్ అవ్వడానికి సిద్ధమైంది.


ఉషా మెహతా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘ ఏ వతన్ మేరే వతన్’. స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఎంతోమంది ఉద్యమకారులలో  రేడియో ద్వారా స్పూర్తిని నింపిన వారిలో ఒకరి జీవిత కథ ఇది. అప్పడు జరిగిన ఎన్నో కన్నీటికథలని నేటి యువతరానికి అందించాలని ఈ సినిమా తీసామని మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మూవీని ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా మార్చి‌ 21 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్నట్టు కరణ్ జోహార్ తెలిపారు. ఇమ్రాన్ హష్మీ, సచిన్ ఖేడ్కర్, అభయ్ వర్మ, ఆనంద్ తివారీ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.



Source link

Related posts

Housing Loan Home Loan Latest Interest Rates In Various Banks 2024 Check Here

Oknews

దేశంలోని మొత్తం సీసీటీవీ కెమెరాల్లో 64శాతం తెలంగాణలోనే

Oknews

Brs Plan To Public Meeting On Krmb,Grmb Water Dispute

Oknews

Leave a Comment