పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(pawan kalyan) ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నాడు. వచ్చే ఎలక్షన్స్ కి పూర్తిగా సన్నద్ధమయ్యే పనిలో భాగంగా పవన్ తను ఒప్పుకున్న సినిమాలని సైతం పక్కన పెట్టేసాడు. కానీ ఆ సినిమాలన్నీ కూడా ఇప్పటికే కొంత భాగాన్ని షూటింగ్ ని కూడా పూర్తి చేసుకోవడంతో ఆయా సినిమాలకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ బయటకి వస్తూనే ఉంది. తాజాగా ఒక సినిమాకి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ తన కొత్త మూవీ ఓజి(og)లో ఒక సాంగ్ పాడబోతున్నాడు.ఈ మూవీకి సంగీతాన్ని అందిస్తున్న థమన్ ఓజి లో పవన్ పాడనున్న విషయాన్ని వెల్లడి చేసాడు. గ్యాంగ్ స్టర్స్ నేపథ్యంలో తెరకెక్కే ఈ మూవీకి సాహో ఫేమ్ సుజిత్(sujeeth)దర్శకత్వాన్ని వహిస్తుండగా డివివి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై డివివి దానయ్య ఓజి ని నిర్మిస్తున్నాడు. పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోను భారీ అంచనాలు ఉన్న ఈ మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా సలార్ ఫేమ్ శ్రీయ రెడ్డి ఒక కీలక పాత్రలో నటిస్తుంది.
పవన్ తన కెరీర్ స్టార్టింగ్ నుంచే తమ్ముడు,ఖుషి,జానీ, గుడుంబా శంకర్,పంజా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, అజ్ఞాత వాసి లాంటి తదితర చిత్రాల్లో పాటలు పాడి తన అభిమానులతో పాటు ప్రేక్షకులని అలరించాడు.