Top Stories

సింపుల్ గా అర్జున్ కూతురు నిశ్చితార్థం


సీనియర్ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్, త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడీ వేడుకకు సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. ఈరోజు ఐశ్వర్య అర్జున్ ఎంగేజ్ మెంట్ పూర్తయింది.

తమిళ నటుడు తంబి రామయ్య తనయుడు ఉమాపతి, అర్జున్ కూతురు ఐశ్వర్య కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. వీళ్ల ప్రేమ ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఈరోజు కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా నిశ్చితార్థం ముగిసింది.

చెన్నైలో అర్జున్ స్వయంగా నిర్మించిన హనుమాన్ టెంపుల్ లో ఈ ఎంగేజ్ మెంట్ జరిగింది. పెళ్లికి తేదీ కూడా ఖరారు చేశారు. కానీ ఆ డేట్ ఇంకా బయటకు రాలేదు. తాజా సమాచారం ప్రకారం, ఐశ్వర్య-ఉమాపతి పెళ్లి ధాయ్ లాండ్ లో చేయాలని అనుకుంటున్నారట.

తమిళ్ లో అర్జున్ హోస్ట్ చేసిన ఓ కార్యక్రమంలో ఉమాపతి పాల్గొన్నాడు. అదే కార్యక్రమంలో ఐశ్వర్య అర్జున్ పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లితో ఒకటి కాబోతున్నారు. తన చిన్న కొడుకు ఉమాపతి, తన ప్రేమ సంగతి చెప్పిన వెంటనే ఒప్పుకున్నానని, తనకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు తంబి రామయ్య.

అర్జున్ తన కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా పనిచేసేందుకు ప్రోత్సహించారు. అలా తండ్రి ఆశీస్సులతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఐశ్వర్య, విశాల్ లాంటి హీరోల సరసన కొన్ని సినిమాలు చేసింది. అయితే ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. ఒక దశలో స్వయంగా అర్జున్, కూతుర్ని పెట్టి తెలుగు-తమిళ భాషల్లో ఓ సినిమా ప్లాన్ చేశాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు.

ఇప్పుడు ఐశ్వర్య, పెళ్లితో లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావిస్తోంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో నటిస్తుందా లేదా అనేది తెలియరాలేదు.



Source link

Related posts

గెలుపా? కులమా? ఏది ముఖ్యం!

Oknews

అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి.. జ‌నంలోకి జ‌గ‌న్‌!

Oknews

మోత మోగిస్తున్న జ‌గ‌న్‌…టీడీపీ ఆర్త‌నాదం!

Oknews

Leave a Comment