దిశ, ఫీచర్స్: బోనులో ఉన్న సింహాలను, పులులను చూసి కొందరు భయపడి దూరంగా ఉంటే.. మరికొందరు వాటితో చెలగాటమాడుతారు. పులులు, సింహాలతో పరాచకాలు ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు తరచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. రీసెంట్‌గా డిల్లీలోని ఓ జంతు ప్రదర్శన శాలతో ఓ యువకుడు ఫుల్‌గా మందు తాగి సింహాన్నే బెదిరించాడు.
అంతటితో ఆగకుండా సింహం దగ్గరికి వెళ్లి.. సింహాన్ని అదే పనిగా చూడడం మొదలుపెట్టాడు. సింహం ఏ మూడ్‌లో ఉందోకానీ అతడిని ఏం అనకుండా వదిలిపెట్టింది. లేకపోతే ఆ యువకుడి ప్రాణాలు అప్పటికప్పుడే గాల్లో కలిసిపోవు. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ వ్యక్తి జూలో సింహాంతో పరాచకాలు ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువకుడు సింహం బోను వద్దకు మైక్ తీసుకుని వెళ్లి.. ఇంటర్వ్యూ చేశారు. సింహం కూడా అతడి దగ్గరకు వచ్చింది. వెంటనే ఆ యువకుడు ప్రశ్నలు అడగడం స్టార్ట్ చేశాడు.
రెండు క్వశ్చన్స్ అడగ్గానే సింహం.. ఏంటి? నీ ప్రబ్లమ్. పక్కకు వెళ్లు.. తమాషా చేయకుండా అన్నట్లుగా తన తల అడ్డంగా తిప్పుతుంది. అంతటితో ఆగకుండా ఆ పర్సన్ మళ్లీ ప్రశ్నిస్తాడు. మళ్లీ సింహం తన పక్కకు తిప్పుతుంది. ఆ వ్యక్తి మైక్ సింహం దగ్గర పెట్టి మూడోసారి మరో ప్రశ్న వేస్తాడు. ఇక వీడు నార్మల్‌గా చెబితే వినడని.. సింహం ఒక్కసారిగా గాడ్రిస్తుంది. ఈ దెబ్బకు ఆ వ్యక్తి భయంతో పారిపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వగా.. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.