Health Care

సిగరెట్ ఫిల్టర్లను దేనితో తయారు చేస్తారో తెలుసా? యువత తప్పక తెలుసుకోవాల్సిన విషయం!


దిశ, ఫీచర్స్: రోజురోజుకు దేశవ్యాప్తంగా సిగరెట్ కాల్చే వారి సంఖ్య మరింత పెరుగుతుంది. ప్రస్తుత రోజుల్లో యువత సిగరెట్ కు ఎంతగా బానిసైందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిగరెట్ ఆరోగ్యానికి హాని కలుగజేస్తుందని తెలిసినా పురుషులతో పాటు కొంతమంది మహిళలు కూడా విపరీతంగా తాగుతున్నారు. స్మోక్ చేయడం వల్ల ఎంతో మందికి క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు తరచూ చెబుతుంటారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోకుండా తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.

బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నేరం.. ఆరోగ్యానికి హానికరం అని థియేటర్లలో సినిమా పడే ముందు యాడ్ చూపిస్తుంటారు. అయినా ప్రజలు వినరే. ఇలా సిగరెట్ తాగుతూ.. ప్రపంచవ్యాప్తంగా ఏటా 80 లక్షల మంది మరణిస్తున్నారు. ప్రస్తుతం ఇండియాలో స్మోక్ చేసేవారి సంఖ్య 26 కోట్లు. అయితే ఒక సిగరెట్ తాగితే ఆ వ్యక్తి జీవితంలో 11 నిమిషాలు తగ్గిపోతాయట. మరో అధ్యయనం ప్రకారం.. 30 ఏళ్ల వయసున్న వ్యక్తి స్మోక్ చేస్తే మరో 35 ఏళ్లు మాత్రమే జీవిస్తారట. కాగా మీ ఆయుష్షును మీరు తగ్గించుకున్నవారువుతున్నారు.

ఇకపోతే సిగిరేట్ ఫిల్టర్లను దేనితో తయారు చేస్తారో తెలిస్తే ఆశ్యర్యపోతారు. ఈ విషయం తెలిశాక సిగరెట్ కాల్చడం మానుకోవడం పక్కా. విషయానికొస్తే… సిగరెట్ లో సెల్యూలోజ్ అసిటేట్ కోర్ ఉంటుంది. దీని మీద రెండు పొరల రేయాన్ ర్యాప్ ఉంటుంది. ఫిల్టర్ ప్రధాన భాగంలో సెల్యూలోజ్ అసిటేట్ ఫైబర్ ఉంటుంది. అంటే ఒక ఫిల్టర్ లో 12,000 ఫైబర్స్ ఉంటాయట. అలాగే కాల్షియం కార్బోనేట్ ను కాగితం పైన పూస్తారట. కాగితం పై పూసిన పదార్థం చాలా డేంజర్. కాగా ఎంత డేంజర్ పదార్థాన్ని మీరు పీలుస్తున్నారో అర్థం చేసుకోండి.



Source link

Related posts

ఆషాడంలో అమ్మాయిలు గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా?

Oknews

ఓట్స్ మసాలా వడలు ఈ విధంగా తయారు చేసుకోండి

Oknews

హై కోర్టులో ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా ..

Oknews

Leave a Comment