కూతురు చావుకు భర్త, అత్తమామలు, ఆడపడచు కారణంతల్లిగారింటి నుంచి వచ్చిన తర్వాత భర్త, అత్తమామలు ఆమెను బంగారం తీసుకొచ్చావా? అని మరల వేధింపులకు గురిచేశారు. దీంతో మనస్తాపం చెందిన రేఖ శనివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య(Dowry Death) చేసుకుంది. వెంటనే గ్రామస్తులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చి చూడగా కూతురు విగతజీవిగా పడి ఉంది. తల్లిదండ్రులు బోరున విలపించారు. తన కూతురు చావుకు భర్త, అత్తమామలు, ఆడపడచు కారణమని దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్ లో తండ్రి ఫిర్యాదు చేశారు. తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Source link