సిద్ధార్థ్, అదితిరావు హైదరి రిలేషన్ ఉన్న విషయం తెలిసిందే. అడపా దడపా వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూనే ఉన్నాయి. తమ మధ్య ఏదో వుంది అని చెప్పేందుకు వీరిద్దరూ తెగ తంటాలు పడుతున్నారు. అజయ్ భూపతి డైరెక్షన్‌లో వచ్చిన ‘మహా సముద్రం’ సెట్స్‌లోనే వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఇద్దరి అభిరుచులు కలవడంతో వెంటనే రిలేషన్‌లోకి వెళ్ళిపోయారట. వీరిద్దరి రిలేషన్‌పై అజయ్ భూపతి చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సిద్ధార్థ్, అదితి కలిసి తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేస్తూ అజయ్ భూపతి తన ట్వీట్‌లో ఏమన్నాడంటే.. ‘దీనికి నేనే కారణం నేనే అని అందరూ అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది?’ అంటూ ప్రశ్నించాడు. వీరిద్దరితోనూ సినిమా చేసిన డైరెక్టరే ఈ ప్రశ్న అడగడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే షూటింగ్ జరుగుతున్నంత కాలం అతని ఎదురుగానే వారు ఉంటారు. ఈ విషయం తెలియకుండా ఉంటుందా అనేది నెటిజన్ల ప్రశ్న. అజయ్ ఈ ప్రశ్న వేయడం వెనుక సిద్ధార్థ్, అదితి మధ్య విషయం ఉందని ఇప్పుడు అందరూ ఫిక్స్ అయ్యారు. 2021లో వచ్చిన ‘మహాసముద్రం’ డిజాస్టర్ అయిన విషయం తెలిసిందే. అయితే సిద్ధార్థ్, అదితికి ఇది సూపర్‌హిట్ మూవీనే. ఎందుకంటే వీరి రిలేషన్‌కి పునాది వేసింది ఆ సినిమానే కాబట్టి వారికది మెమరబుల్ మూవీ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.