EntertainmentLatest News

సినిమాలు చేయకుండా నన్నెవరూ ఆపలేరు.. ఒకసారి కౌన్సిల్‌ ఆలోచించుకోవాలి!


హీరోగా నటిస్తూనే తమ బేనర్‌లో సినిమాలు నిర్మిస్తుంటారు విశాల్‌. హీరోగా, నిర్మాతగానే కాదు తమిళ చిత్ర పరిశ్రమలో పలు సమస్యలపై పోరాటం కూడా చేశారు. ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. అయితే కొన్ని ఆరోపణలు కూడా అతనిపై వచ్చాయి. దానికి కూడా ఆయన వివరణ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. విశాల్‌తో సినిమాలు చేయకూడదని ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఎక్స్‌ వేదికగా విశాల్‌ స్పందించారు. 

‘నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. నన్నెవరూ ఆపలేరు. మీ పని మీరు చేసుకోండి’ అంటూ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌కి కౌంటర్‌ ఇచ్చారు విశాల్‌. ఒకవేళ తనను ఆపాలని ప్రయత్నిస్తే అలా చేసిన వారు ఎప్పటికీ సినిమాలు నిర్మించలేరన్నారు. తను ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు కౌన్సిల్‌ సభ్యుల సంక్షేమం కోసం నిధులు వినియోగించానని గుర్తు చేశారు. అంతేకాదు, వృద్ధులు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి ఆరోగ్యబీమా కల్పించానన్నారు. ఈ నిర్ణయాలన్నీ తానొక్కడినే తీసుకోలేదని, మిగతా సభ్యులతో కలిసి చేసినవేనని తెలిపారు. ప్రస్తుత కౌన్సిల్‌పై ఎన్నో బాధ్యతలు ఉన్నాయని, వాటిని సక్రమంగా చేస్తే సరిపోతుందని అన్నారు. తనకు సినిమాలు చేయకపోతే సొంతంగా తీసుకునే కెపాసిటీ తనకు ఉందని అందరికీ తెలుసునని గుర్తు చేశారు. తనను సినిమాలు చేయకుండా ఆపాలన్న ప్రయత్నం చేసే ముందు ఒకసారి ఆలోచించుకోమని కౌన్సిల్‌కు సలహా ఇచ్చారు విశాల్‌. 



Source link

Related posts

YCP comedy on Janasena star campaign జనసేన స్టార్ క్యాంపెయిన్ పై వైసీపీ కామెడీ

Oknews

వృద్ధాశ్రమంలో కన్ను మూసిన లెజండరీ డైరెక్టర్‌!!

Oknews

YS Sharmila Steps Creates Tension in YS Jagan ఆమె కూడానా? ఇక జగన్‌కు చుక్కలే

Oknews

Leave a Comment