సినిమా ఫ్లాప్స్‌పై స్టార్ హీరో హాట్ కామెంట్స్..! Great Andhra


ఎన్నేళ్లుగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ వరుస విజయాలతో బాక్సాఫీస్‌ను శాసించారు. అయితే, ఇటీవల కాలంలో ఆయన అనేక చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో “బడే మియాన్ చోటే మియాన్” పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన తర్వాత, అక్షయ్ తాజా చిత్రం “సర్ఫిరా” కూడా హిట్ అందుకోలేక‌పోయింది. సూర్య నటనకు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుచుకున్న తమిళ చిత్రం “సూరరై పొట్రు”కి ఇది రీమేక్. సుమారు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో 12 రోజుల తర్వాత కూడా దేశీయ మార్కెట్లో కేవలం 21.5 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

ఓ ఇంటర్వ్యూలో, తన ఫ్లాప్స్ గురించి అక్షయ్ మాట్లాడుతూ “ప్రతి సినిమాలో చాలా కష్టం, అభిరుచి ఉంటుంద‌ని.. ఏదైనా సినిమా విఫలమవుతుందనేది బాధ‌రకం అని.. కానీ దానిలో సానుకూలతను చూడటాన్ని నేర్చుకోవాలి.. ప్రతి విఫలం విజయానికి విలువ నేర్పుతుంది. అదృష్టవశాత్తూ, నా కెరీర్ ప్రారంభంలోనే దానిని ఎదుర్కోవడం నేర్చుకున్నాను. మ‌న చేతిలో ఉన్నది ఏమిటంటే, మరింతగా కష్టపడి ఇంకో సినిమాపై దృష్టిపెట్ట‌డ‌మే” అని అన్నారు. తన విజయ రహస్యం క్రమశిక్షణ, పనిపై శ‌ద్ద పెట్ట‌డ‌మే అని అన్నారు.

కోవిడ్ తర్వాత సినిమా పరిశ్రమలో చోటు చేసుకున్న మార్పుల గురించి మాట్లాడుతూ ” కోవిడ్ మహమ్మారి చిత్ర పరిశ్రమ డైనమిక్స్‌ను మార్చింది. ప్రేక్షకులు సినిమా చూడడానికి, సినిమా ఎంచుకోవ‌డంలో కీల‌కంగా మార‌డంతో… ప్రేక్ష‌కుల‌కు అనుగుణంగా కంటెంట్‌పై మ‌రింత జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌సరం” ఉంద‌న్నారు.

సూపర్‌స్టార్‌గా మారటానికి అధిగమించవలసిన అతిపెద్ద అడ్డంకి గురించి అడిగినప్పుడు “నా బ్యాక్‌గ్రౌండ్ చూసినప్పుడు, బాలీవుడ్‌లో చిత్రాలు చేయడం ఓ కలగా అనిపించింది. ఈ పరిశ్రమ పోటీ ఎక్కువ‌గా ఉంటుంది, దానిలోకి ప్రవేశించడం కోసం టాలెంట్ మాత్రమే కాదు, మనోధైర్యం, కృషి, కొంత అదృష్టం అవసరం. కానీ పట్టుదలగా, ప‌నిపై మూర్ఖంగా ఉండేవాడిని. కాబట్టి, నేను ఒక అడుగు ముందుకేసి లక్ష్యాలపై దృష్టి” సాధించన‌న్నారు



Source link

Leave a Comment