Telangana

సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్ మాల్, హరీశ్ రావు పీఏ అరెస్టు-కాదని కార్యాలయం క్లారిటీ!-hyderabad cmrf cheque fraud for outsourcing employees arrest harish rao office clarified ,తెలంగాణ న్యూస్



స్పందించిన హరీశ్ రావు కార్యాలయంసీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ల గోల్ మాల్ వ్యవహరంలో హరీశ్ రావు పీఏ అరెస్టు(Harish Rao PA Arrest) అయినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశంపై హరీశ్ రావు కార్యాలయం స్పందించింది. ఎమ్మెల్యే హరీశ్ రావు పీఏ ఈ చెక్ లు కాజేశాడని వార్తలు వస్తున్నాయి. అయితే వీటిలో వాస్తవం లేదని హరీశ్ రావు కార్యాలయం పేర్కొంది. నరేశ్ ఎమ్మెల్యే హరీశ్ రావు పీఏ కాదని తెలిపింది. అతడు ఒక కంప్యూటర్ ఆపరేటర్ అని, గతంలో హరీశ్ రావు కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసేవాడని స్పష్టత ఇచ్చింది. మంత్రిగా హరీశ్ రావు పదవీకాలం ముగియడంతో ఆయన కార్యాలయాన్ని గత ఏడాది డిసెంబర్ 6న మూసివేసి, సిబ్బందిని పంపించేసినట్లు తెలిపింది. అప్పటి నుంచి నరేశ్ కు హరీశ్ రావు కార్యాలయానికి ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. ఆఫీసు మూసివేసే క్రమంలో సిబ్బందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నరేశ్ కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను(CMRF Cheque Fraud) తీసుకువెళ్లినట్లు తెలిసిందన్నారు. ఈ వ్యవహారంలో నరేశ్ అనే వ్యక్తిపై 2023 డిసెంబర్ 17న నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ వ్యవహారంతో, నరేశ్ అనే వ్యక్తితో హరీశ్ రావుకు గానీ, ఆయన కార్యాలయానికి గాని ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.



Source link

Related posts

పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తం బదిలీ – హైదరాబాద్ సీపీ సంచలన నిర్ణయం

Oknews

IRCTC Gujarat Tour 2024 : హైదరాబాద్ – గుజరాత్ ట్రిప్

Oknews

Four Youth Drowned : తెలంగాణలో పండుగపూట తీవ్ర విషాదం, నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి

Oknews

Leave a Comment