ఫొటోలు ఉన్నాయి – మన్నె క్రిశాంక్ఈ కేసుపై ఇవాళ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు మన్నె క్రిశాంక్(Manne Krishank). పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఫిర్యాదు చేస్తే నాపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పారు. చిత్రపురి కాలనీలో రూ. మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఫిరోజ్ ఖాన్ ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. పోలీసులు నోటీసులు ఇచ్చి తన మొబైల్ ఫోన్, పాస్‌పోర్ట్‌ను తీసుకున్నారని అన్నారు. చిత్రపురి సొసైటీ కోశాధికారి అనుముల మహానంద రెడ్డి ఎవరో తెలియదని సీఎం అంటున్నారని… మహానందరెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి దిగిన ఫోటోలు వున్నాయని చెప్పారు. గతంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తే రేవంత్ రెడ్డి ఫోన్ సీజ్ చేశామా? అని ప్రశ్నించారు. తనపై పెట్టిన కేసుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.
Source link
previous post