Congress Indravelli Meeting : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఇంద్రవెల్లి సభ సెంటిమెంట్ గా మారింది. గతంలో దళిత గిరిజన దండోరా కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులుగా పాల్గొన్నారు. ప్రస్తుతం మరోసారి ఇంద్రవెల్లి సభకు సీఎం హోదాలో హాజరుకానున్నానరు. దళిత గిరిజన దండోరా కార్యక్రమం విజయవంతమైన విషయం తెలిసిందే. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా తెలంగాణలో జిల్లాల పర్యటన చేస్తున్న నేపథ్యంలో సెంటిమెంట్ గా భావించిన ఇంద్రవెల్లి నుంచి ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలతో, డీసీసీ అధ్యక్షులతో సమీక్ష సమావేశం నిర్వహించుకున్నారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లి సభ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గంలో ఇంద్రవెల్లిలో స్థానిక ఎమ్మెల్యే వెడమా బుజ్జి పటేల్, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు హరి రావు, మంచిర్యాల జిల్లా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావులు సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. గతంలో దళిత గిరిజన దండోరా ఏ విధంగా సక్సెస్ అయిందో అదే విధంగా రేవంత్ సభను సక్సెస్ చేయాలని మండల స్థాయి నాయకులకు దిశానిర్దేశాలు అందజేశారు. అయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ అధ్యక్షుని హోదాలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని 40 ఏళ్ల ఇంద్రవెల్లి ఘటనలో నష్టపోయిన కుటుంబాలకు చేయూతనిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని స్థానికులు కోరుతున్నారు.
Source link