మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిహైదరాబాద్ నగరం చుట్టూ అన్ని ప్రాంతాల్లో సమానమైన అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్(Musi River Front Development) కింద అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీని అభివృద్ధి చేస్తామన్నారు. నగరం నలుమూలల్లో అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతోనే మెట్రో మార్గాన్ని విస్తరించే ప్రణాళికలు రూపొందించామన్నారు. ఉప్పల్ నుంచి నాగోల్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి మీదుగా విమానాశ్రయం వరకు, బీహెచ్‌ఈఎల్ నుంచి రామచంద్రాపురం వరకు, గచ్చీబౌలీ నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు మెట్రో విస్తరించబోతున్నామని ప్రకటించారు.
Source link