నా రూటే సపరేటు అంటూ లక్షలాది మంది ప్రేక్షకులని తన అభిమానులుగా మార్చుకున్న హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(mohan babu) ఆయన నట వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన నటి మంచు లక్ష్మి(manchu lakshmi)తన తండ్రి లాగే అన్ని క్యారెక్టర్స్ లోను అద్భుతంగా నటించగలదు. 2011 లో వచ్చిన అనగనగా ఒక ధీరుడు మూవీనే అందుకు ఉదాహరణ. ఐరేంద్రి అనే అతీంద్రియ శక్తులున్న క్యారక్టర్ లో సూపర్ గా నటించి మెస్మరైజ్ చేసింది. అంతకంటే ముందే కొన్ని ఇంగ్లీష్ చిత్రాల్లో చేసింది. దీన్ని బట్టి తన సినీ ఎక్స్ పీరియన్స్ ని అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా ఆమె ఒక సీక్రెట్ ని బయటపెట్టింది. ఇప్పుడు అది వైరల్ గా మారింది.
మంచు లక్షి ప్రెజంట్ ముంబై లో ఉంటుంది. కెరీర్ కోసం తన ఫ్రెండ్స్ రకుల్ ప్రీత్, రానా (rana)ముంబై రావాలని కోరడంతో అక్కడికి మకాం మార్చింది. ఈ మేరకు ఖరీదైన ప్లాట్ ఒకటి రెంట్ కి తీసుకొని ఉంటుంది. ఇంత వరకు బాగానే ఉంది. కాకపోతే ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో రెంట్ కి తీసుకోకముందు ఎవరి ఇంట్లో ఉన్నాననే విషయాన్నీ చెప్పింది. ఇల్లు తీసుకోక ముందు ముంబైలోనే ఉన్న రామ్ చరణ్(ram charan)ఇంట్లో ఉన్నాను. కాకపోతే ఈ విషయాన్ని ఎవరికి చెప్పకుండా రహస్యంగా ఉంచాను. చరణ్ తో కూడా ఎవరికీ చెప్పొద్దని చెప్పాను. దాంతో నేనెందుకు చెబుతానని అన్నాడని చెప్పింది. అసలు ఎందుకు అంత సీక్రెట్ గా ఉంచాల్సి వచ్చిందో అనే దానికి కూడా వివరణ ఇచ్చింది.
చరణ్ ఇంట్లో ఉంటున్నానని తెలిస్తే ఎవరు కూడా నాకు ముంబై లో వర్క్ చేసి పెట్టరు.ఎందుకంటే చరణ్ ఇంట్లో ఉంటున్నారు కద మీకు మా అవసరం ఏంటని అంటారు. అందుకే రహస్యంగా ఉంచాను. చరణ్ కూడా చాలా మంచి తనంతో నీకు నచ్చినన్ని రోజులు ఉండమని అన్నాడు. ఆ తర్వాత నేను ఎన్ని రోజులు ఉన్నానో కూడా చరణ్ కి తెలియదని చెప్పింది. ఇక ఇదే ఇంటర్వ్యూ లో తన తండ్రి మీద పరోక్షంగా కొన్ని ఆరోపణలు కూడా చేసింది. సౌత్ చిత్ర పరిశ్రమలో హీరోల కూతుళ్లు, సిస్టర్స్ కి ఆఫర్స్ రావు. మా నాన్నకు కూడా నేను నటిని కావడం ఇష్టం లేదు. ఒక రకంగా చెప్పాలంటే పితృస్వామ్య సమాజంలో నేను కూడా బాధితురాలిని అని చెప్పింది. తన తండ్రి తో ఎంతో క్లోజ్ గా ఉండే లక్ష్మి ఇప్పుడిలా చెప్పడం చర్చీనీయాంశంగా మారింది.