Andhra Pradesh

సీనియర్ ఐఏఎస్ ఇంతియాజ్ వీఆర్ఎస్-త్వరలో వైసీపీలోకి, కర్నూలు నుంచి పోటీ?-kurnool news in telugu senior ias officer imtiaz ahmed applied for vrs may joins ysrcp contest in elections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


కర్నూలు గ్రూప్ రాజకీయాలకు ఇంతియాజ్ తో చెక్

నిజాయితీ గల అధికారిగా పేరున్న ఇంతియాజ్..తన కుటుంబం నిర్వహించే ట్రస్ట్ ద్వారా ప్రజా సేవలో చురుకుగా పాల్గొంటారు. తన బావ డాక్టర్ కె.ఎం.ఇస్మాయిల్ కర్నూలు నగరంలో రూ.2 వైద్యుడిగా పేరుపొందారు. డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ కోవిడ్ -19 సమయంలో మరణించారు. అతను తన సేవలను పేదలకు విస్తరించడానికి కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు చెందిన పేదలు డాక్టర్ ఇస్మాయిల్ హుస్సేన్ దగ్గర చికిత్స పొందేందుకు కర్నూలుకు వచ్చేవారు. కర్నూలు వైసీపీలో రెండు గ్రూపుల మధ్య హోరాహోరీ పోరు సాగుతున్న నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కర్నూలు అసెంబ్లీకి ఇంతియాజ్‌ ను సిద్ధం చేశారు. గత కొన్నేళ్లుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, స్థానికంగా ఉన్న ఎస్వీ మోహన్‌ రెడ్డి టికెట్ల కోసం ఒకరిపై ఒకరు ఎత్తులు వేస్తు్న్నారు. ఇంతియాజ్‌ ఎంట్రీతో ఈ గొడవకు తెరపడుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.



Source link

Related posts

AP Cabinet Portfolio List : ఏపీ మంత్రుల శాఖలు ఖరారు

Oknews

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టు కీలక నిర్ణయం-vijayawada acb court postpones hearing on chandrababu bail custody petition to tomorrow ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

YS Jagan In Prakasam: “వైఎస్ శంకుస్థాపన… జగన్ ప్రారంభం” దేవుడి స్క్రిప్ట్‌గా అభివర్ణించిన సిఎం జగన్

Oknews

Leave a Comment