ప్రముఖ సినీ నటి అండ్ స్టార్ యాంకర్ సుమ(suma)కి ఇప్పుడు పెద్ద చిక్కొచ్చి పడింది. సుమ లాంటి సెలబ్రిటీ మాటలు నమ్మి మోసపోయాం. కేవలం ఆమె వల్లే లక్షలు లక్షలు కట్టాం.సుమ మాకు న్యాయం చెయ్యాలి. ఇపుడు ఈ మాటలన్నీ ఏ ఒక్కరో అనటం లేదు.కొన్ని వందల మంది అంటున్నారు. బహుశా సుమ కూడా ఈ సిట్యువేషన్ ని ఉహించి ఉండదు.
మూడు సంవత్సరాల క్రితం ప్రముఖ కన్ స్ట్రక్షన్ కంపెనీ రాకీ ఎవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్(raki avenues private limited)ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి లో చంద్రిక అవంతిక ఫేస్ 2 అనే వెంచర్ వేసింది. డబుల్ బెడ్ రూమ్, త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లని కట్టి తక్కువ రేట్ కే ఇస్తామని ప్రచారం చేసింది. బ్రాండ్ అంబాసిడర్ గా సుమ నే ఉంది.నమ్మకంతో కూడిన కంపెనీ అని కూడా చెప్పింది. దీంతో చాలా మంది సొంత ఇంటి కోసం డబ్బులు కట్టారు. ఒక్కొక్కరు లక్షల్లో నుంచి కోట్లు రూపాయల దాకా కట్టారు .కానీ ఇప్పటి వరకు ఫ్లాట్స్ కట్టలేదని ఎక్కడకి వెళ్లారో కూడా తెలియదని బాధితులు వాపోతున్నారు. కొంత మంది అయితే సుమ ఈ విషయంలో కల్పించుకోవాలని ఆమెని చూసే డబ్బులు కట్టామని చెప్తున్నారు. ప్రస్తుత గవర్నమెంట్ కూడా కల్పించుకొని న్యాయం చెయ్యాలని కోరుతున్నారు.
ఇక సోషల్ మీడియాలో ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుండంతో సుమ ఫ్యాన్స్ అయితే ఇలాంటి వాటికి ప్రమోట్ చేసేటపుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక గతంలో కూడా చాలా మంది సినీ సెలబ్రిటీస్ కొన్ని సంస్థలకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండటం. ఆ తర్వాత అవి బోర్డు తిప్పెయ్యడం లాంటి సంఘటనలు జరిగాయి.బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఇందుకు మినహాయింపు కాదు.