EntertainmentLatest News

సురేష్ రైనా చెన్నై లో కలవబోయేది ఈ హీరోనే 


ఇండియాలో రెండిటికి ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఒకటి సినిమా..రెండు క్రికెట్. పైగా వాటిల్లో తమకి నచ్చిన వ్యక్తిని గాడ్ గా కూడా కొలుస్తుంటారు. మరీ  ఆ ఇద్దరకీ సంబంధించిన న్యూస్ వస్తే ఇంకేమైనా ఉందా. క్షణాల్లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఇండియా  మొత్తం ఆ పనిలోనే ఉంది.

సురేష్ రైనా..ఇండియన్ క్రికెట్ టీం కి చెందిన ఒకప్పటి  స్టార్ క్రికెటర్. ఎన్నోసార్లు జట్టుని  ఓటమి అంచుల్లోనుంచి గట్టెక్కించాడు. ఐదు ,ఆరో నంబర్ బ్యాట్స్ మన్ గా వచ్చి ఆపోజిట్ జట్టు అవకాశాలని పూర్తిగా దెబ్బ తీసేవాడు.అలాగే  సూర్య రెండున్నర దశాబ్దాలుగా నటనా రంగంలో రాణిస్తు ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. వీళ్లిద్దరు   ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ (ఐఎస్ పి ఎల్ ) లో కలిశారు.ఇద్దరు వేరు వేరు టీం లలో పార్టిసిపేట్ చేసారు. ఈ సమయంలో సురేష్ రైనా,  సూర్య లు కలిసి కొన్ని ఫోటోలు దిగారు. వీరిలో సూర్య పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ పిక్స్ ని   రైనా తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అలాగే  సూర్య ని కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పడంతో పాటుగా .  త్వరలోనే చెన్నైలో కలుద్దామని కూడా సూర్య కి హింట్ ఇచ్చాడు.

సూర్య ప్రస్తుతం కంగువా అనే మూవీ చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్లో  ఆ మూవీ విడుదల కాబోతుంది. ఇక సురేష్ రైనా 2005 నుంచి 2018 వరకు ఇండియాకి ప్రాతినిధ్యం వహించాడు. 2018 లో తన లాస్ట్ వన్ డే ఆడాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్ ) కి  చెన్నై తరుపున కూడా ఆడాడు. 

 



Source link

Related posts

congress senoior leader vh sensational comments on deputy cm bhatti vikramarka | V Hanumnatha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ కంటతడి

Oknews

BRS News: సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు – పద్మారావు గౌడ్ పేరు ప్రకటించిన కేసీఆర్

Oknews

AP Governor will be in charge governer For Telangana | Telangana New Governer : రాజ్‌భవన్ ఖాళీ చేసి వెళ్లిపోయిన తమిళిశై

Oknews

Leave a Comment