స్టార్ హీరోయిన్స్ చోటా హీరోలతో నటించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే ప్రేక్షకులు ఆ కాంబోని ఆదరించిన సందర్బాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో అలాంటి ఒక కాంబో గురించి చర్చ మొదలయ్యింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.
హీరోలకి ఫ్రెండ్ గా నటించే స్థాయి నుంచి హీరోగా మారిన నటుడు సుహాస్. కలర్ ఫోటో, రైటర్ పద్మ భూషణ్, రీసెంట్ గా వచ్చిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ లతో మంచి విజయాలనే అందుకున్నాడు. ఇప్పుడు ఇతని ఖాతాలో ఉప్పు కప్పురంబు అనే మూవీ ఉంది. ఇందులో సుహాస్ సరసన కీర్తి సురేష్ నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కీర్తికి కథ చెప్పారని క్యారక్టర్ కూడా ఆమెకి బాగా నచ్చిందని అంటున్నారు. మరికొద్ది రోజుల్లో మేకర్స్ నుంచి అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
స్వతహాగా తమిళనాడు కి చెందిన కీర్తి సురేష్ తెలుగులో నటించిన చివరి చిత్రం భోళా శంకర్. అందులో చిరు చెల్లెలుగా ఆమె నటించిన తీరుకి ప్రశంసలు దక్కాయి. నేను శైలజ ,నేను లోకల్, రెమో, సర్కారు వారి పాట, దసరా లాంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. ఇక మహానటి తో ఆమె ఎంతగా సంచలనం సృష్టించిందో అందరకి తెలిసిందే. సీనియర్ నటీమణి సావిత్రి నిజ జీవితాన్ని తన క్యారక్టర్ ద్వారా కళ్ళకి కట్టినట్లు చూపించింది.జాతీయ అవార్డుని సైతం అందుకుంది.