Health Care

సూర్యున్ని మింగేస్తున్న కాలరంధ్రం.. ఏడాదికి 370 నక్షత్రాలను కూడా..


దిశ, ఫీచర్స్ : విశ్వ రహస్యాల ఛేదనలో భాగంగా సైంటిస్టులు మరో కొత్త విషయాన్ని కనుగొన్నారు. ఏడాదికి 370 సూర్యులను (మండుతున్న నక్షత్రాలు)తినగలిగే అపారమైన ‘ఆకలి’తో ఉన్న ఒక బ్లాక్ హోల్‌ను తాజాగా గుర్తించారు. పరిశోధనల్లో భాగంగా ఆస్ట్రేలియన్ నేషనల్ యూనిర్సిటీకి చెందిన సైంటిస్టులు యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ (ESO) వెరీ లార్జ్ టెలిస్కోప్ (VLT)ని ఉపయోగించి అంతరిక్ష పరిశోధనలు చేశారు. ఈ క్రమంలోనే వారు విశ్వంలోనే అత్యంత ప్రకాశవంతమైన ఒక వింత ఆకారాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

సూర్యుడికన్నా 17 వందలకోట్ల రెట్లు పెద్దగా ఉన్న ఒక కాలరంధ్రాన్ని గనుగొన్న సైంటిస్టులు అది అత్యంత వేగంగా కదులున్న క్రూరమైన క్వాసార్‌గా పేర్కొంటున్నారు. పైగా ఇది సూర్యుడికంటే 500 లక్షల కోట్లు ఎక్కువ వేడిగా, ప్రకాశవంతంగా ఉందని తెలిపారు. ఇది మండే నక్షత్రాలను తినేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ బ్లాక్ హోల్ చుట్టూ సుడులు తిరుగుతున్న సౌరతుఫానులు పుట్టుకొస్తున్నాయని, ఇది విశ్వంలోనే అత్యంత విస్ఫోటనాకరంగా ఉండే ప్రదేశమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. పరిశోధనల్లో భాగంగా ఈ క్వాసార్‌ను 1980లో కూడా సైంటిస్టులు గుర్తించినప్పటికీ, అప్పట్లో కేవలం నక్షత్రంగానే భావించారు. కానీ అది పెద్ద క్వాసార్‌ అని మాత్రం తాజాగా కనుగొన్నారు. భూమికి 12 బిలియన్‌ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ క్వాసార్ తన చుట్టు పక్కల ఉన్న పెద్ద పెద్ద నక్షత్రాలను రోజుకొకటి మింగేస్తోందని, అది ఏడాదికి 370 నక్షత్రాలను తనలో కలిపేసుకుంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.



Source link

Related posts

మార్కెట్ మాయాజాలం.. ప్రేమను నిలబెట్టుకోవడానికి అప్పులు చేసి, అవస్థలు పడుతున్న యువత

Oknews

వర్షాకాలంలో ఒళ్లు.. కీళ్ల నొప్పులు ఎక్కువ.. కారణం ఇదే

Oknews

శరీరంలో పేరుకుపోతున్న విష పదార్థాలు.. మత్తు పదార్థాలు సేవించేవారిలోనే..

Oknews

Leave a Comment