EntertainmentLatest News

‘సేవ్ ది టైగర్స్-2’ వెబ్ సిరీస్ రివ్యూ


వెబ్ సిరీస్ : సేవ్ ది టైగర్స్-2

నటీనటులు: అభినవ్ గోమటం, ప్రియదర్శి, కృష్ణ చైతన్య, జోర్దార్ సుజాత,  దేవయాని శర్మ, పావని గంగిరెడ్డి,  సీరత్ కపూర్, దర్శనా బానిక్, వేణు వెల్దండి తదితరులు

ఎడిటింగ్:  శ్రవణ్ కటికనేని

మ్యూజిక్: అజయ్ అరసాడ

సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశ్వేశ్వర్

నిర్మాతలు: మహి వి రాఘవ్

దర్శకత్వం: అరుణ్ కొత్తపల్లి

ఓటీటీ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్


సేవ్ ది టైగర్స్ మొదటి సీజన్ ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా సీజన్ -2 రిలీజ్ చేశారు. మరి ఈ సిరీస్ కథేంటో ఓ సారి చూసేద్దాం..

కథ:

గంటా రవి(ప్రియదర్శి), విక్రమ్(చైతన్య కృష్ణ), రాహుల్(ఆబినవ్ గోమటం) లని ఎస్సై పోలీస్ స్టేషన్ లో వేసి హీరోయిన్ హంసలేఖ ఎక్కడ ఉందంటూ ఇంటరాగేషన్ చేస్తుంటాడు. హీరోయిన్ హంసలేఖ కనపడటం లేదని, ఆమె లాస్ట్ మీ ముగ్గురితోనే కనపడిందని ఎస్సై అడుగుతాడు. ఇక గంటా రవి(ప్రియదర్శి) తనకి గుర్తుంది చెప్తాడు. అదే సమయంలో మీడియాలో వీరిని ఇంటారాగేషన్ చేసేది లీక్ అవుతుంది. వైరల్ న్యూస్ కోసం తహతహలాడే ఓ న్యూస్ రిపోర్టర్ వీరిని రేపిస్టులని  చిత్రీకరిస్తారు. ఆ న్యూస్ చూసిన గంటా రవి భార్య, రాహుల్ భార్య, విక్రమ్ భార్య పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. అసలు హంసలేఖ ఎక్కడుంది? ఆ ముగ్గురు బయటకొచ్చారా? ఆ రాత్రి తాగిన మత్తులో వాళ్ళేం చేశారనేది మిగతా కథ.. 

విశ్లేషణ: 

మొదటి సీజన్ మంచి వీక్షకాధరణ పొందడంతో డైరెక్టర్ అరుణ్ కొత్తపల్లి రెండవ సీజన్ ని కూడా అదే పంథాలో తీసుకెళ్ళాడు‌. ప్రతీ ఎపిసోడ్ లో కామెడీతో పాటు కథని గ్రిస్పింగ్ గా మలిచాడు‌. మొదటి ఎపిసోడ్ నుండి చివరి వరకు క్లీన్ కామెడీని చూపించారు.

ముఖ్యంగా గంటా రవి పాత్ర సిరీస్ కి ప్లస్. అపార్ట్మెంట్ కొనాలనే తన భార్య కోరిక కోసం గంటా రవి పడేపాట్లు నవ్వు తెప్పిస్తాయి. మొదటి పార్ట్ లో సేవ్ ది టైగర్స్ కి జస్టిఫికేషన్ ఇచ్చినట్టుగా ఈ సీజన్ లో వారి భార్యలు తాగి పబ్బుల్లో ఎంజాయ్ చేసి ఇంటికొచ్చి భర్తలతో చేసే కామెడీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ముఖ్యంగా మొదటి మూడు ఎపిసోడ్ లు నవ్వులు పూయించాయి.

హీరోయిన్ హంసలేఖ స్వయంగా వారిని కలవడం.. వారితో కలిసి ఓ ప్రాజెక్టు కూడా చేయాలని చెప్పడం గంటా రవి, రాహుల్ లు నమ్మలేకపోతుంటారు. ఇక రాహుల్ ఆఫీస్ అని చెప్పి పనిమనిషితో జరిగే డిస్కషన్ ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తుంది. ప్రతీ అపార్ట్మెంట్ లో జరిగే చిన్న చిన్నగొడవలని ఎత్తిచూపిస్తూనే దానిలో కామెడీ మిక్స్ చేసి అలరించారు మేకర్స్. మొదటి ఎపిసోడ్.. వేర్ ఈజ్ ద హంసలేఖ. ఇందులో ముగ్గురిని ఇంటారాగేషన్ చేస్తుండగా హంసలేఖ స్టేషన్ కి రావడంతో ముగుస్తుంది. రెండవ ఎపిసోడ్.. సెవెన్ ఇయర్ ఇచ్.. ఇందులో టైగర్స్ భార్యలు సైకాలిజిస్ట్ దగ్గరికి వచ్చి వారి లైఫ్ ని చెప్పుకునే సీన్లతో కామెడీగా సాగుతుంది. మూడవ ఎపిసోడ్ హెయిల్ ఉమెన్ పవర్.. ఇందులో భార్యలు పబ్ కి వెళ్ళి తాగి జల్సాలు చేయడం అంతా సూపర్ ఫాస్ట్ కామెడీతో పాటు సీరియస్ టాపిక్ ని సిల్లీగా చూపిస్తారు. నాల్గవ ఎపిసోడ్ టెన్ థౌజెండ్ బిసి.. ఇందులో టైగర్స్ ట్రాజెడీని రివీల్ చేస్తూ  ఆ రాత్రి జరిగిందాని గురించి చూపించారు. ఇక అయిదవ ఎపిసోడ్ లో రాహుల్ అపార్ట్మెంట్ లోని వారంతా వారి కుక్కలని తీసుకొచ్చి చేసే గొడవ బాగుంటుంది. ఆరవ ఎపిసోడ్ ఫ్యామిలీ సెలెబ్రిషన్స్.. ఇందులో టైగర్స్ ఫ్యామిలీ అంతా కలిసి సెలెబ్రేషన్స్ జరుపుకుంటాయి. అందులో గంటా రవి, రాహుల్,  విక్రమ్ ల పంథా అందరిని ఆకట్టుకుంది. ఇక ఫైనల్ ఎపిసోడ్ లో అన్ని ఫ్యామిలీలు కలవడానికి కలిసి ఉండటానికి జరిగే డిస్కషన్స్ అందరిని ఆలోచింపజేస్తాయి. సిరీస్ మొత్తం కామెడీ, కథని సరి సమానంగా తీసుకెళ్ళారు మేకర్స్. అయితే నాల్గవ, అయిదు ఎపిసోడ్ లలో కాస్త ల్యాగ్ సీన్లు ఉన్నాయి. కొన్ని చోట్ల పిల్లలతో చేసేటప్పుడు స్కిప్ చేయొచ్చు. అశ్లీల పదాలు వాడలేదు. సిరీస్ మొత్తం ఫ్యామిలీతో కలిసి చూసేలా చాలా జాగ్రత్త పడ్డారు మేకర్స్. ఎస్.వి.విశ్వేశ్వర్ సినిమాటోగ్రఫీ బాగుంది. అజయ్ అరసాడ మ్యూజిక్ పర్వాలేదు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ నీట్ గా ఉంది. మహి వి రాఘవ నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల పనితీరు:

ప్రియదర్శి, అభినవ్ గోమటం, కృష్ణ చైతన్య పాత్రలతో అందరు కనెక్ట్ అవుతారు. గంగవ్వ, జోర్దార్ సుజాత ఇలా చెప్పుకుంటే పోతే ప్రతీ పాత్రతో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు‌‌. ఇక మిగిలిన వారు వారి పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.

ఫైనల్ గా : హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసే వెబ్ సిరీస్ ఇది. 

రేటింగ్ : 3/5

✍️. దాసరి మల్లేశ్

 



Source link

Related posts

దేవర పార్ట్ 2 కోసం వెయిటింగ్…

Oknews

పొలిటికల్ పార్టీ మీటింగ్ లో రామ్ చరణ్..ఫ్యాన్స్ అసహనం

Oknews

Steps To Close Paytm FASTag and Shift To Another Bank FASTag

Oknews

Leave a Comment