సైకోటిక్ బ్రేక్ డౌన్.. సెలబ్రిటీస్ నుండి సాధారణ వ్యక్తుల వరకు ఎవ్వరినీ వదలదిది..


posted on Nov 2, 2023 3:10PM

అనారోగ్యం వచ్చిందంటే  హాస్పిటల్స్ కు పరిగెత్తి వైద్యం చేయించుకుంటారు. పేదల దగ్గర డబ్బులుండవని, ధనికుల దగ్గర.. ముఖ్యంగా సెలబ్రిటీస్ దగ్గర డబ్బు చాలా ఉంటుందని అందుకే వారు ఏ జబ్బుకైనా వైద్యం చేయించుకోగలుగుతారని అంటారు. కానీ సెలబ్రిటీలు సైతం జయించలేని జబ్బులు ఏవైనా ఉన్నాయంటే అవి మానసిక సమస్యలే. నిజానికి సెలబ్రిటీలకు కూడా చాలా తొందరగా మానసిక సమస్యలు వస్తుంటాయి. దీనికి కారణం వారి జీవనశైలి కూడా.  మానసికంగా ఇబ్బంది పట్టే సమస్యలలో సైకోటిక్ బ్రేక్ డౌన్  ప్రధానమైనది. అమెరికన్  గాయని లేడీ గాగా తన 19సంవత్సరాల వయసులో ఓ మ్యూజిక్  డైరెక్టర్ చేతిలో అత్యాచారానికి గురై సైకోటిక్ బ్రేక్ డౌన్ కు లోనైంది. ఆ సమయంలో తను  పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ తో బాధపడ్డానని స్వయంగా ఆమె చెప్పుకుంది.  సైకోటిక్ బ్రేక్ డౌన్ లో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ప్రధానమైనది.  అసలు  ఈ మానసిక సమస్య లక్షణాలు ఏంటి?  ఇది మనిషిని ఎలా ప్రభావితం చేస్తుంది? పూర్తీగా తెలుసుకుంటే..

పోస్ట్ ట్రామాటిక్  స్ట్రెస్ డిజార్డర్..

కొన్ని వ్యాధుల లక్షణాలు బయటకు కనిపిస్తే కొన్ని బయటకు కనిపించవు. సాధారణంగా శారీరక వ్యాధులు కొన్ని లక్షణాల రూపంలో బయటపడుతుంటాయి.  కానీ మానసిక వ్యాధులు మాత్రం క్లిష్టతరమైనవి. చాలా గమనిస్తే తప్ప వాటిని తెలుసుకోలేం.  పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్టర్ అనేది మనిషి మానసికంగా చాలా దారుణంగా దెబ్బ తిన్న వారిలో కలుగుతుంది. కానీ దాని ఫలితాన్ని బాధితులు అంత  తొందరగా అర్థం చేసుకోలేరు.

భావోద్వేగాలు..

కొన్నిసార్లు మీరు అతిగా భావోద్వేగానికి గురైనప్పుడు, మీరు చిన్న విషయాలకు కూడా ఏడుపు ప్రారంభిస్తారు. ఒక వ్యక్తి ఎటువంటి కారణం లేకుండా విపరీతమైన అలసటను అనుభవిస్తాడు. మనస్సు సున్నా స్థితికి వెళుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అసలైన, అలాంటి సమయాల్లో మీరు మానసికంగా అలసటకు గురవుతారు. ఇది మీ మెదడుకు విరామ సమయం అని అర్థం. ఇందులో మీరు ఒత్తిడికి గురవుతారు మరియు పరిస్థితులను సరిగ్గా నిర్వహించలేరు. ఇది కెరీర్‌పైనే కాదు వ్యక్తిగత జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

ఆందోళన, ఒత్తిడి..

ఆందోళన, ఒత్తిడి సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు చిన్న విషయాలకు కూడా ఆందోళన పడతారు.  ఒత్తిడి అనుభవిస్తారు. భావోద్వేగాల విషయంలో  అలసటకు గురికావడం ఈ సమస్య ఉన్నవారిలో బయటకు కనిపించే లక్షణం.  ఈ సమస్య ఉన్న వారు చుట్టుప్రక్కల  విషయాలపై దృష్టిపెట్టలేరు. భావోద్వేగాలను  అదుపు చేసుకోలేరు.  నిరంతరాయంగా ఇలాంటి ఫీలింగ్స్ ఎదుర్కొంటున్నట్టైతే  వారు వ్యాధి బారిన పడ్డారని అర్థం చేసుకోవాలి.  దీన్నుండి బయటపడాలంటే  మనిషికి విరామం కావాలి. ఆ విరామంలో సరైన నిర్ణయం తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అలా తీసుకోలేని పక్షంలో అది వ్యక్తికి చాలా హానికరం. ఇలాంటి సమస్య ఉన్నవారు  చాలా జాగ్రత్తగా జీవితాన్ని లీడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

                                                                  *నిశ్శబ్ద.



Source link

Leave a Comment