Health Care

సైక్లింగ్‌తో క్యాన్సర్‌కు చెక్


దిశ , ఫీచర్స్ : ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అదే సమయంలో గ్రహాన్ని రక్షించేందుకు ఖర్చులేని పని ఏదైనా ఉందంటే అది సైక్లింగ్ మాత్రమే. బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతున్న పెడ్లింగ్.. ఎలాంటి కర్బన ఉద్గారాలు లేని, పర్యావరణ అనుకూలమైన రవాణాకు సహాయపడుతుంది. దీంతోపాటు మరెన్నో ప్రయోజనాలు ఉండగా.. అవేంటో తెలుసుకుందాం.

*సైకిల్ తొక్కడం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలు చేకూరుతున్నాయి. ఒత్తిడితో కూడిన సమయాల్లో బాడీ, మైండ్ రెండిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. మెరుగైన నిద్ర, జీవితం పట్ల సానుకూల దృక్పథం, బరువు తగ్గడం, చక్కని శరీరం వంటి లాభాలున్నాయి.

* బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం సైక్లింగ్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది. బ్యాడ్ లైఫ్ స్టైల్ కారణంగా వచ్చే రక్తపోటు, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

* సైక్లింగ్ నిద్రను ప్రేరేపిస్తుంది. నిద్ర విధానాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఎముక ఆరోగ్యం, సాంద్రత మెరుగుపడుతుంది. శరీరం దిగువ భాగం బలపడుతుంది. వెన్నెముకను మరింత తటస్థంగా ఉంచడం ద్వారా ఎగువ శరీరం భంగిమ మెరుగవుతుంది.

* కండరాల బలాన్ని పెంచుతుంది. నొప్పులను తగ్గిస్తుంది. వయస్సు సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత మొదలైన అభిజ్ఞా సామర్థ్యాలను పెంచుతుంది. మెదడు ఆరోగ్యానికి మంచిది కూడా.



Source link

Related posts

మానసిక ఒత్తిడిని దూరం చేస్తున్న ఆత్మీయ స్పర్శ.. ఆరోగ్యంపైనా సానుకూల ప్రభావం..

Oknews

ఐఏఎస్ ఆఫీసర్ ఆమ్రపాలి ప్రేమించిన ఆ లక్కీ బాయ్ ఎవరో తెలుసా..?

Oknews

NIACL లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

Oknews

Leave a Comment